మనసంతా నువ్వే చిత్రంలోని ఒక చక్కని పాట ఈరోజు తలచ్కుందామ్. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : మనసంతా నువ్వే
సంగీతం : RP.పట్నాయక్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : కే.కే, సుజాత
ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా
అడుగు నేలపై ఆగనన్నది ఎంత ఆపుతున్నా
పిల్ల గాలితో తూగుతున్నది వింత హాయిలోనా
ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా
అటు ఇటు తిరుగుతు కన్నులు
చిలిపి కలలను వెతుకుతు ఉన్నవి
మదిని ఊరించు ఆశనీ కలుసుకోవాలనో
మధురభావాల ఊసుని తెలుసుకోవాలనో
ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా
తడబడు తలపుల అల్లరి
ముదిరి మనసును తరుముతు ఉన్నది
అలలుగా తేలి నింగిని పలకరించేందుకో
అలసటే లేని ఆటలో అదుపు దాటేందుకో
ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా
అడుగు నేలపై ఆగనన్నది ఎంత ఆపుతున్నా
పిల్ల గాలితో తూగుతున్నది వింత హాయిలోనా
ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.