ఆదివారం, అక్టోబర్ 08, 2017

ఓరోరి రాజా వీరాధి వీరా...

ఈ రోజు సాయంత్రం ఐదుగంటలకు మాటీవీలో బాహుబలి ది కంక్లూజన్ సినిమా ప్రసారమవుతుంది కదా అందుకే ఈ అందమైన పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బాహుబలి ది కంక్లూజన్ (2017)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : చైతన్య ప్రసాద్
గానం : దీపు, సోని

ఓరోరి రాజా వీరాధి వీరా
ఓరోరి రాజా వీరాధి వీరా
నీతోనె నేను ఉండిపోనా
ఎందాక నువ్వూ వెళ్ళాలి అన్నా
అందాక నేను కూడ రానా
హాయైన హంసనావ లోనా
నీగాలి సోకుతుంటె పైనా
మెచ్చిందిలే దేవసేనా

నేన్నీ ఎదపై
విశాల వీర భూమిపై
వసించనా
నేనే వలపై
వరాల మాలికై వాలనా
నీలో రగిలే
పరాక్రమాల జ్వాలనై
హసించనా
నిన్నే గెలిచే
సుఖాల కేళిలో తేలనా

ఓహొహో ఓహొహో
ఏకాంత కాంత మందిరానా
ఓహొహో ఓహొహో
నీ మోహ బాహు బంధనానా
నూరేళ్ళు బంధీని కానా

ఓరోరి రాజా
ఓరోరి రాజా
వీరాధి వీరా
నీతోనె నేను ఉండిపోనా
ఎందాక నువ్వూ వెళ్ళాలి అన్నా
అందాక నేను కూడ రానా
హాయైన హంస నావలోనా
నీగాలి సోకుతుంటె పైనా
మెచ్చిందిలే దేవసేనా

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.