శనివారం, అక్టోబర్ 28, 2017

నువ్వే నా అదృష్టం...

ఉంగరాల రాంబాబు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఉంగరాల రాంబాబు (2017)
సంగీతం : జిబ్రాన్
సాహిత్యం : రెహ్మాన్
గానం : రేవంత్, చిన్మయి

నువ్వే నా అదృష్టం
నువ్వే నా తీయని కష్టం
ఐపోవా నా సొంతం
నువ్వే నా ఊపిరిగీతం
నువ్వే నా పగలురేయి
నువ్వేలే నా దునియా
నువ్వే నా దిగులు హాయి
అంటుందీ గుండెలయా
ముహుర్తమే ముంచుకు
వచ్చేసిందే ముడిపడిపోగా

నువ్వే నా అదృష్టం
నువ్వే నా తీయని కష్టం
ఐపోవా నా సొంతం
నువ్వే నా ఊపిరిగీతం

తొలిసారి నిన్నే చూస్తూనే మనసిచ్చాలే
నీదారిలోనే పువ్వుల్నే పరిచేశానే
కనుసైగతోనే ప్రాణాన్నే గెలిచేశావే
నను లాగుతూనే దూరాన్నే తరిమేశావే
కాలమే భారమైందిలా
సాయమే నిన్ను కోరిందిలా
ఆశకే రెక్కలొచ్చాయిలా
ఆగనంటోంది లోలోపలా
ఎగిసే శ్వాసే తెలిపే నిన్నేచేరాలీవేళా
కాలం కలిసొచ్చిందె కలలే నడిచొచ్చేనీలా

నువ్వే నా అదృష్టం
నువ్వే నా తీయని కష్టం
ఐపోవా నా సొంతం
నువ్వే నా ఊపిరిగీతం

నువ్వే నా పగలురేయి
నువ్వేలే నా దునియా
నువ్వే నా దిగులు హాయి
అంటుందీ గుండెలయా
ముహుర్తమే ముంచుకు
వచ్చేసిందే ముడిపడిపోగా


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.