ఆదివారం, ఆగస్టు 23, 2015

ఎలా ఎలా ఎలా...

యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక చక్కని మెలోడీ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పంజా (2011)
సంగీతం : యువన్ శంకర్ రాజా
సాహిత్యం : చంద్రబోస్
గానం : హరిహరన్, శ్వేతా పండిట్

ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలా
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలా
ఎడారిలో గోదారిలా
నాలో అలా ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయం లోన పొందా జన్మ మరలా

ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలా
ఎడారిలో గోదారిలా
నాలో అలా ఆపేదెలా

నిన్నలోని నిమిషమైన గురుతు రాదే ఈక్షణం
నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం
ఈ స్నేహమే వరం ఈ భావమే నిజం
ఇది తెలుపబోతే భాష చాల్లెదేలా

నా భాషలోన తీయ్యందనం
నా బాటలోన పచ్చందనం
పసి పాపలాగా నవ్వే గుణం
నీ వల్లే నీ వల్లే వెలిగింది నా నీడ నీ నీడలోనే చేరాలని
నూరేళ్ళ పయనాలు చేయాలని
ఈ పరవశం లోన నిలిచా ప్రాణ శిలలా

ఎలా ఎలా ఎలా ఎలా
నాలో కళా చూపేదేలా
ఎడారిలో గోదారిలా
నాలో అలా ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయం లోన పొందా జన్మ మరలా
 
I wanna hold you
I wanna hold you in my heart
I wanna hold you
I wanna hold you in my heart


1 comments:

ఈ పాటలోనూ..ట్యూన్ లోనూ తెలీని తపన..అలా..అలా..మనని తాకుతుంది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.