బుధవారం, ఆగస్టు 12, 2015

చిలకా పలకవే...

పక్కింటమ్మాయిని ప్రసన్నం చేస్కోడానికి ఈ హీరోగారు ఎన్ని పాట్లు పడుతున్నారో సరదాగా చూసొద్దాం రండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పక్కింటి అమ్మాయి (1980)
సంగీతం :  చక్రవర్తి
సాహిత్యం :
గానం : బాలు

చిలకా పలకవే ఆ కిటికీ తెరవవే 
చిలకా పలకవే ఆ కిటికీ తెరవవే  
పక్కింటీ చిన్నవాడు ప్రేమించే వన్నెకాడు
నీకోసం ఉన్నవాడూ.. నువు లేక బతకలేడు..
చిలకా పలకవే ఆ కిటికీ తెరవవే 
చిలకా పలకవే ఆ కిటికీ...

అందాల కిటికీలో ఉందొక్క చందమామ 
అందాల కిటికీలో ఉందొక్క చందమామ
నెలవంక చల్లగానే లేదూ..
నిలువెల్ల వేడెంతో రేపిందిలే.. 
తాపాన్ని కాస్తా తగ్గించమంటా.. 
ముసినవ్వు నవ్వగానే 
ముత్యాలూ రాలతాయి.. 
రవ్వంతా కనికరిస్తే 
రతనాలే దొరుకుతాయి 

చిలకా పలకవే ఆ కిటికీ మూయకే..
చిలకా పలకవే..

నువ్వేమో చిలకైతే నేనేగ గోరువంకా 
నువ్వేమో చిలకైతే నేనేగ గోరువంకా 
నా వంకా ఓరచూపు చూడూ.. 
నీ చెంత నా గుండె వాలేనులే.. 
నీమీద ఒట్టూ నా జట్టుకట్టూ.. 
పాడాలీ భావగీతం 
ఆడాలీ ప్రేమ నాట్యం 
పొంగాలీ నిండు హృదయం 
ఏలాలీ ప్రణయ రాజ్యం..

చిలకా పలకవే ఆ కిటికీ మూయకే..
చిలకా పలకవే ఆ కిటికీ మూయకే..
పక్కింటీ చిన్నవాడు ప్రేమించే వన్నెకాడు
నీకోసం ఉన్నవాడూ.. నువు లేక బతకలేడు..
చిలకా పలకవే ఆ కిటికీ మూయకే..
చిలకా పలకవే..

1 comments:

హిందీలో(పడోసన్) కిషోర్ కుమార్ గారూ..తెలుగులో బాలూ గారూ ఈ మూవీకి ప్రాణం పోశారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.