ఘంటసాల గారు గానం చేసిన ఒక సరదా అయిన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : పెళ్ళి సందడి (1959)
సంగీతం : జె.వి. రాఘవులు
సాహిత్యం :సముద్రాల (జూనియర్)
గానం : ఘంటసాల, జిక్కి
బైఠో బైఠో పెళ్ళికొడకా
ఆల్రైటో రైటో నా పెళ్ళి కూతురా
బైఠో బైఠో పెళ్ళికొడకా
ఆల్రైటో రైటో నా పెళ్ళి కూతురా
బైఠో బైఠో పెళ్ళికోడకా
అడ్రస్ తెలియక అల్లాడిపోతీ అందాల పూబంతి
ఓహో..
అడ్రస్ తెలియక అల్లాడిపోతీ అందాల పూబంతి
నిను జూచిన దినం మొదలు
నే మజ్నూనైపోతినే.. హాయ్.. మజ్నూనైపోతినే
హా.. బైఠో బైఠో పెళ్ళికొడకా
ఆల్రైటో రైటో నా పెళ్ళి కూతురా
బైఠో బైఠో పెళ్ళికొడకా
అయ్యో పాపమీ అవస్థ చూస్తే గుండెనీరు కాదా
ఆహా..
అయ్యో పాపమీ అవస్థ చూస్తే గుండెనీరు కాదా
వెళ్ళీ వెదకు నీ చెలీ లైలను ఎడారీ దారులా
హా..
వెళ్ళీ వెదకు నీ చెలీ లైలను యెడారీ దారులా
హాయ్.. ఎడారీ దారులా..
హా.. బైఠో బైఠో పెళ్ళికొడకా
ఆల్రైటో రైటో నా పెళ్ళి కూతురా
బైఠో బైఠో పెళ్ళికొడకా
లైలా.. లైలా.. నువ్వే నా లైలా..
హా..
వలచి నన్ను దయ తలచకున్న నా తలను కోసుకుంటా
వలచి నన్ను దయ తలచకున్న నా తలను కోసుకుంటా
ఆ.. తలా తీసుకొను పనేలేదురా నిన్నే చేసుకుంటా
హా..
తలా తీసుకొను పనేలేదురా నిన్నే చేసుకుంటా
హాయ్.. అదే కావాలంటా..
హా..
బైఠో బైఠో పెళ్ళికూతురా
ఆల్రైటో రైటో నా పెళ్ళి కొడకా
బైఠో బైఠో పెళ్ళికూతురా
ఆల్రైటో రైటో నా పెళ్ళి కొడకా
బైఠో బైఠో..
ఆల్రైటో రైటో..
బైఠో బైఠో..
ఆల్రైటో రైటో..
1 comments:
జిక్కీగారి గొంతు యెలాంట్తి టైం లో విన్నా భలే హుషారొస్తుంది కదా వేణూజీ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.