మిత్రులకు వరలక్ష్మీవ్రతం సంధర్బంగా శుభాకాంక్షలు. ఈ రోజు దేవాంతకుడు చిత్రంలోని ఈ పాట తలచుకుందామా. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : దేవాంతకుడు (1960)
సంగీతం : అశ్వత్థామ
సాహిత్యం : ఆరుద్ర
గానం : పి.లీల, కోరస్
శ్రీదేవి సిత కమలాలయా
శ్రీదేవి సిత కమలాలయా
నీ దివ్యపాదాలు సేవింతుమమ్మా
శ్రీదేవి సిత కమలాలయా
శ్రీదేవి సిత కమలాలయా
నీ దివ్యపాదాలు సేవింతుమమ్మా
నీ దివ్యపాదాలు సేవింతుమమ్మా
శ్రీదేవి సిత కమలాలయా
పసుపు కుంకుమలతో వసుధలో జీవించ
వరమిచ్చి వాటితో దరి చేర్చినావు ఆఆఆ...ఆఆ..
వరమిచ్చి వాటితో దరి చేర్చినావు
పెనిమిటి ఒడిలోన తనువు వీడుట కన్నా
మహిళ పూజా ఫలము మరి వేరు లేదమ్మా..
శ్రీదేవి సిత కమలాలయా
దివి చేరినా ఆ భువిలోన జీవించు
పతిమేలు కోరుటే సతి ధర్మమమ్మా..ఆఆఆ..
పతిమేలు కోరుటే సతి ధర్మమమ్మా
కరుణించి పాలించి తరగని సిరులిచ్చి
ధరలోన గల మా మగవారి బ్రోవుమా
శ్రీదేవి సిత కమలాలయా
నీ దివ్యపాదాలు సేవింతుమమ్మా
నీ దివ్యపాదాలు సేవింతుమమ్మా
శ్రీదేవి సిత కమలాలయా
1 comments:
ఓ..శ్రావణ శుక్రవార లక్ష్మిని ఈ పాటతో ఆహ్వానించారా..బాగు బాగు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.