బందిపోటు చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : బందిపోటు (1963)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల
ఊ హూ హూ.. ఊ ఊ ఊ...
ఊ ఊ ఊ.... ఊ ఊ ఊ
ఊ హూ హూ.. ఊ ఊ ఊ...
ఊ ఊ ఊ.... ఊ ఊ ఊ
ఊహలు గుసగుసలాడే
నా హృదయము ఊగిసలాడే
ప్రియా... ఊ
ఊహలు గుసగుసలాడే
నా హృదయము ఊగిసలాడే
వలదన్న వినదీ మనసు
కలనైన నిన్నే తలచు
వలదన్న వినదీ మనసు
కలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలే
అది నీకు మునుపే తెలుసు
ఊహలు గుసగుసలాడే
నా హృదయము ఊగిసలాడే
నను కోరి చేరిన బేలా
దూరాన నిలిచేవేలా
నను కోరి చేరిన బేలా
దూరాన నిలిచేవేలా
నీ ఆనతి లేకున్నచో
విడలేను ఊపిరి కూడా
ఊహలు గుసగుసలాడే
నా హృదయము ఊగిసలాడే
దివి మల్లెపందిరి వేసే
భువి పెళ్ళిపీటను వేసే
దివి మల్లెపందిరి వేసే
భువి పెళ్ళిపీటను వేసే
నెర వెన్నెల కురిపించుచు
నెలరాజు పెండ్లిని చేసే
ఊహలు గుసగుసలాడే
మన హృదయములూయలలూగే
1 comments:
ఈ పాటలో ఉన్న మేజిక్ యేంటో గానీ..యెప్పుడు విన్నా..మనసుని మధురం గా చుట్టేస్తుంది..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.