సోమవారం, ఆగస్టు 31, 2015

నీ ఇల్లు బంగారం కాను..

పాట కొన్ని సెకన్లు వినగానే ఎవరు కంపోజ్ చేశారో సులువుగా చెప్పేయగల వైవిధ్యమైన శైలి రమణ గోగుల సొంతం. అదే విషయమై జోకులేసుకున్నాగానీ తన అర్కెస్ట్రేషన్ కోసం పాటలు వినడం కూడా నాకు ఇష్టమే.. యోగి సినిమాలో తను కంపోజ్ చేసిన ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : యోగి (2007)
సంగీతం : రమణ గోగుల
రచన : చంద్రబోస్
గానం : టిప్పు, సునీత

నీ ఇల్లు బంగారం కాను.. నా రవ్వల కొండ
నీ ఒళ్ళో బంధీనౌతాను..
నీ ఒళ్ళు ఉల్లాసంకాను.. నా గవ్వల దండ..
కౌగిల్లో వందేళ్ళుంటాను..
చిలుకను నేను.. చెరుకువు నువ్వు..
కొరికిన వేళ కాదనకు
పలకను నేను.. బలపం నువ్వు..
కలిసిన వేళ వలపులు రాయకుండా వెళ్ళకు..

నీ ఇల్లు నీ ఇల్లు 
నీ ఇల్లు బంగారంగాను.. నా రవ్వల కొండ
నీ ఒళ్ళో బంధీనౌతాను..
ఆఆ..నీ ఒళ్ళు ఉల్లాసం కాను.. నా గవ్వల దండ..
కౌగిల్లో వందేళ్ళుంటాను..

నీకే అందకపోతే అందం అందం కానే కాదు..
నీతో ఆడకపోతే ఆటే కాదంట..
నువ్వే ఉండకపోతే లోకం లోకం కానే కాదు..
నీలో ఉండకపోతే నేనే కాదంటా..
దొరలాగా.. దొరికావు.. నిను దోచుకోక పోను..
కథలాగ కదిలావు నిను చదవకుండా వెళ్ళను

నీ ఇల్లు నీ ఇల్లు 
నీ ఇల్లు బంగారం కాను.. నా రవ్వల కొండ
నీ ఒళ్ళో బంధీనౌతాను..
ఆఆ..నీ ఒళ్ళు ఉల్లాసంకాను.. నా గవ్వల దండ..
కౌగిల్లో వందేళ్ళుంటాను..
ఏఓ..ఏఓ.. నా రవ్వల కొండ.. 
ఏఓ..ఏఓ.. ఊ.హూహూ.. 
ఏఓ..ఏఓ.. నా పువ్వుల దండ
ఏఓ..ఏఓ.. ఊ.హూహూ.. 

ముక్కుపోగు చెప్పేసింది ముద్దుకు అడ్డం రానని..
మువ్వ కూడా చెప్పేసింది సవ్వడి చెయ్యదని
చిట్టి సిగ్గు చెప్పేసింది గుట్టును దాచేస్తానని
జారు పైట చెప్పేసింది మాటె జారనని..
మగవాడై తగిలావు ముడి వేసుకోక పొను
వగలడై రగిలావు సెగలణచకుండా ఉండను

నీ ఇల్లు నీ ఇల్లు 
నీ ఇల్లు బంగారం కాను.. నా రవ్వల కొండ
నీ ఒళ్ళో బంధీనౌతాను..
ఆఆ..నీ ఒళ్ళు ఉల్లాసంకాను.. నా గవ్వల దండ..
కౌగిల్లో వందేళ్ళుంటాను..
చిలుకను నేను.. చెరుకువు నువ్వు..
కొరికిన వేళ కాదనకు
పలకను నేను.. బలపం నువ్వు..
కలిసిన వేళ వలపులు రాయకుండా వెళ్ళకు..

నీ ఇల్లు నీ ఇల్లు 
నీ ఇల్లు బంగారంగాను.. నా రవ్వల కొండ
నీ ఒళ్ళో బంధీనౌతాను..
ఆఆ..నీ ఒళ్ళు ఉల్లాసం కాను.. నా గవ్వల దండ..
కౌగిల్లో వందేళ్ళుంటాను..

ఏఓ..ఏఓ.. నా రవ్వల కొండ.. 
ఏఓ..ఏఓ.. ఊ.హూహూ.. 
ఏఓ..ఏఓ.. నా పువ్వుల దండ
ఏఓ..ఏఓ.. ఊ.హూహూ.. 


1 comments:

రమణా గోగుల గారి బాణీ,వాణీ రెండూ వైవిధ్యంగానే ఉంటాయి..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.