శనివారం, ఆగస్టు 15, 2015

ఇది మన భారతం...

మిత్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంధర్బంగా లీడర్ సినిమాలోని ఈ పాట తలచుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : లీడర్ (2009) 
సంగీతం : మిక్కీ జె మేయర్ 
సాహిత్యం : వేటూరి
గానం : నకేష్ అజీజ్

ఏ శకుని ఆడని జూదం బ్రతుకే ఓ చదరంగం
ఇది ఆరని రావణకాష్ఠం చితిలోనే సీమంతం
ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో
ఈ నేరం ఇక దూరం ఇది మాతరం

వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం

ఏ శకుని ఆడని జూదం బ్రతుకే ఓ చదరంగం
ఇది ఆరని రావణకాష్ఠం చితిలోనే సీమంతం
ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో
ఈ నేరం ఇక దూరం ఇది మాతరం


వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం


మిగిలిన ఆ దిక్కుగా నిలిచినా నాతల్లికై
పగిలిన ఆ నింగిలో నిలవని ఈ ధృవతారకై
రాజ్యాలేలే ఈ డబ్బు హోదా
కాలే జ్వాలను నేనై జీవన యజ్ఞం సాగించగా
వచ్చే ఆపద విచ్చే పూపొద నడిపిస్తా కదా

వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం 

1 comments:

అసలు వందేమాతరమన్న పదం లోనే ఓ అద్భుతమైన పవర్ దాగి ఉందేమోనండీ..యెవరెన్ని వెర్షన్స్ లో పాడినా యెప్పుడూ అద్భుతంగా ఉంటుంది..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.