శనివారం, ఆగస్టు 29, 2015

రంగు రంగుల పూలు..

మిత్రులకు రాఖీ శుభాకాంక్షలు ఈ సందర్బంగా విచిత్ర కుటుంబంలోని ఈ పాట తలచుకుందామా.. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : విచిత్రకుటుంబం (1969) 
సంగీతం : టి.వి.రాజు
రచన : సినారె
గానం : ఘంటసాల, సుశీల

రంగు రంగుల పూలు.. నింగిలో మేఘాలు
చల్లని బంగరు కిరణాలు.. మా చెల్లాయికి ఆభరణాలు
రంగు రంగుల పూలు.. నింగిలో మేఘాలు

వైశాఖమాసం వస్తుంది..ఎర్రని ఎండలు కాస్తుంది
శ్రావణమాసం వస్తుందీ..ఈ..
శ్రావణమాసం వస్తుందీ..చల్లని జల్లులు తెస్తుందీ
నిప్పులు చెరిగే అన్నయ్య కోపం..చప్పున చల్లారిపోతుందీ


రంగు రంగుల పూలు..నింగిలో మేఘాలు

తేలిపోయే మబ్బుల్లారా..నీలికలువల మాలికలారా
ఎవరు పంపిన దూతలు మీరు..ఈ..

ఎవరు పంపిన దూతలు మీరు..ఏ లోకాలకు వెళుతున్నారు
ఈడైన చెల్లికి జోడైన వరుని..జాడతెలుసుకొని వస్తారా

విలపించె ఓ మబ్బుల్లారా..వెల వెల బోయే మాలికలారా
కన్నీళ్ళు తుడిచే అన్నయ్యలేడని..కలవరపడుతున్నారా


బిల బిల ఎగిరే గువ్వల్లారా..ఇలపైకాస్తా దిగివస్తారా..
కనరండి మా తల్లి వదినమ్మనూ..
కలికాలాన వెలసిన సీతమ్మనూ
  
రంగు రంగుల పూలు..నింగిలో మేఘాలు
చల్లని బంగరు కిరణాలు..మా చెల్లాయికి ఆభరణాలు
రంగు రంగుల పూలు..నింగిలో మేఘాలు 
ఆహాహాహా ఆహాహా ఆహాహా ఆహాహా ఆహాహాహా..

1 comments:

ఈ రోజు చాలా మంది లా మీరూ బైటికి వెళ్ళకుండా జాగ్రత్త పడుతుంటారా వేణూజీ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.