శుక్రవారం, ఆగస్టు 07, 2015

అరెరె చంద్రకళ..

ముకుంద సినిమాకోసం సిరివెన్నెల గారు వ్రాసిన ఒక అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ముకుంద (2014)
సంగీతం : మిక్కీ జె మేయర్ 
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : కార్తీక్, సాయిశివాని

ఘల్లున ఘల్లున నందన నందన
ఘల్లున ఘల్లున నందన నందన
అరెరె చంద్రకళా జారెనా కిందికిలా 
అందుకేనేమో ఇలా గుండెలో పొంగె అలా 
రెప్పలో ఉన్న కలా చేరెనా చెంతకిలా
కనుకే కన్నులలా మెరిసే మిలా మిలా 

ఏ కైపు వల నిన్నాపెనలా 
చిత్రంగ అలా చూస్తుంటే ఎలా 
ఓ వెల్లువలా ముంచెత్తవేలా 
ఆ వరద ననే కరిగించేలా

హుమ్మని హుమ్మని ఉరికే ఉత్సాహంలో 
పొమ్మని పొమ్మని తరిమేయ్ దూరాన్నీ 
ఝుమ్మని ఝుమ్మని ముసిరే సంతోషంలో 
పొమ్మనే కమ్మని కసిరే కాలాన్నీ

సౌందర్యమా ఒప్పుకో సర్లే అనీ 
ఎందుకు అన్నానా సంగతి ఏదైనా
సందేహమా వదిలేయ్ చిన్నారినీ 
సిగ్గుని పొమ్మన్నా సిద్దపడే ఉన్నా 
తడబాటు నిజం బిడియం సహజం 
ఇష్టానికదో తీయని దాఖలా 
నా బేల గుణం నీ పెంకితనం 
చూస్తుంది కదా దాస్తావేలా

హుమ్మని హుమ్మని ఉరికే ఉత్సాహంలో 
పొమ్మని పొమ్మని తరిమేయ్ దూరాన్నీ 
ఝుమ్మని ఝుమ్మని ముసిరే సంతోషంలో 
పొమ్మనే కమ్మని కసిరే కాలాన్నీ

ఏం చెయ్యనే మహ ముద్దొచ్చావనీ 
మక్కువ ముదిరిందా తిక్కగ తరిమిందా 
ఏం చెప్పనే తట్టుకోలేనే అనీ 
ఎందుకులే నిందా ముందుకురా ముకుందా
గుట్టొదులుకుని గట్టెక్కమని 
లాగొచ్చుకదా నువ్వే నన్నిలా 
ఆకట్టుకుని చేపట్టమని 
పనిగట్టుకుని బతికించాలా



1 comments:

సిరివన్నెలా..పేరులోని వెన్నెలంతా ప్రేమైన పాట..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.