బుధవారం, ఆగస్టు 26, 2015

చిరునవ్వులోని హాయి..

అగ్గిబరాటా చిత్రంలో మలయమారుతం లాంటి ఒక అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అగ్గి బరాట (1966)
సంగీతం : విజయా కృష్ణమూర్తి
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల

చిరునవ్వులోని హాయి...చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి...ఈ నాడు కలిగెనోయి

చిరునవ్వులోని హాయి...చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి...ఈ నాడు కలిగెనోయి

నెలరాజు సైగచేసే..వలరాజు తొంగిచూసే
నెలరాజు సైగచేసే..వలరాజు తొంగిచూసే

సిగపూలలోన నగుమొములోన..వగలేవొ చిందులేసే
సిగపూలలోన నగుమొములోన..వగలేవొ చిందులేసే

చిరునవ్వులోని హాయి...చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి...ఈ నాడు కలిగెనోయి

నయనాల తారవీవే...నా రాజహంస రావే 
అహహ..ఆ..ఆ..ఆ..
నయనాల తారవీవే...నా రాజహంస రావే
నను చేరదీసి...మనసార చూసి.. పెనవేసి నావు నీవే
నను చేరదీసి...మనసార చూసి ..పెనవేసి నావు నీవే

చిరునవ్వులోని హాయి...చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి...ఈ నాడు కలిగెనోయి

పవళించు మేనిలోన...రవళించే రాగవీణ
పవళించు మేనిలోన...రవళించే రాగవీణ

నీలాలనింగి లోలోనపొంగి...కురిపించే పూలవాన
నీలాలనింగి లోలోనపొంగి...కురిపించే పూలవాన

చిరునవ్వులోని హాయి...చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి...ఈ నాడు కలిగెనోయి
ఈ నాడు కలిగెనోయి


1 comments:

ప్చ్..ఇలాంటి పాటలు చూసినప్పుడల్లా..ఇప్పటి హీరో హీరోయిన్స్ ఇకిలించకే-సకిలించకే అని కూడా పాడేసుకుంటున్నందుకు బోల్దు దిగులొచ్చేస్తుంటుందండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.