మంగళవారం, ఆగస్టు 25, 2015

ముద్దుకే ముద్దొచ్చే..

ముద్దమందారం చిత్రంలోని ఒక అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ముద్దమందారం (1981)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

మందారం..ముద్దు మందారం...
మందారం..ముద్ద మందారం...
ముద్దుకే ముద్దొచ్చే... మువ్వకే నవ్వొచ్చే

ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం

ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం

అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా
అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా
పరువాల పరవళ్ళు పరికిణీ కుచ్చిళ్ళు
విరి వాలు జడ కుచ్చుల సందళ్ళు...

కన్నె పిల్లా.. కాదు కళల కాణాచి
కలువ కన్నులా.. కలల దోబూచి

ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం

పలుకులా రాచిలకలా అలకలా ప్రేమ మొలకలా
పలుకులా రాచిలకలా అలకలా ప్రేమ మొలకలా
మలి సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో
కురిసేటి పగడాల వడగళ్ళు

మల్లెపువ్వా.. కాదు మరుల మారాణి
బంతి పువ్వా పసుపు తాను పారాణి

ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం


1 comments:

వేటూరి వారి పుణ్యమా అని గులాబీలతో పాటు మందారాలూ అప్పటి రోజుల్లో అమ్మాయిల జడల్లో బోలెడు చొటు సంపాదించుకున్నాయి ప్రేమకు గురుతుగా..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.