శుక్రవారం, ఆగస్టు 14, 2015

ఆమనీ పాడవే హాయిగా..

కొన్ని పాటలు తెలుగు వాళ్ళ జీవితాల్లో అంతర్భాగమైపోయి ఉంటాయి అలాంటి ఓ ఇళయరాజా గారి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : గీతాంజలి (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

ఆమనీ పాడవే హాయిగా
మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో
పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిల
మౌనమైన వేళల

ఆమనీ పాడవే హాయిగా
ఆమనీ పాడవే హాయిగా


వయస్సులో వసంతమే
ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే
రచించెలే మరీచికా
పదాల నా యెద
స్వరాల సంపద
తరాల నా కథ
క్షణాలదే కదా
గతించి పోవు గాధ నేనని

ఆమనీ పాడవే హాయిగా
మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో


శుకాలతో పికాలతో
ధ్వనించినా మధూదయం
దివీ భువీ కలా నిజం
స్పృశించినా మహోదయం
మరో ప్రపంచమే
మరింత చేరువై..
నివాళి కోరినా
ఉగాది వేళలో
గతించి పోని గాధ నేనని

ఆమనీ పాడవే హాయిగా
మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో
పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిల
మౌనమైన వేళల
ఆమనీ పాడవే హాయిగా
ఆమనీ పాడవే హాయిగా


3 comments:

విత్ యూ రెస్పెక్ట్స్ టూ నాగ్ ఫాన్స్..ఆ రోజుల్లో నాగార్జునకి ఐ మీన్ లుక్ కి ఎగ్జాక్ట్ గా సరిపోయిన మూవీ అండీ ఇది..

దివీభువీ స్పృశించినా..... సరిచేయగలరు

థ్యాంక్సండీ సరి చేశాను..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.