దొరికితే దొంగలు చిత్రం కోసం సాలూరి వారి స్వరకల్పనలో సినారే గారి రచనను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : దొరికితే దొంగలు (1965)
సంగీతం : సాలూరి రాజేశ్వర రావు
రచన : సి.నారాయణ రెడ్డి
గానం : ఘంటసాల, సుశీల
ఎవరన్నారివి కన్నులని
ఎవరన్నారివి కన్నులని
అరెరె మధువొలికే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని
ఎవరన్నారివి బుగ్గలని
హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి
ఎవరన్నారివి కన్నులని
నడుమిది ఏమంటున్నది?
ఈ నడుమిది ఏమంటున్నది?
నా పిడికిట ఇమడెదనన్నది
నల్లని జడ ఏమన్నది?
నా నల్లని జడ ఏమన్నది?
అది నను బంధించెద నన్నది
నను బంధించెదనన్నది
ఎవరన్నారివి కన్నులని
అరెరె మధువొలికే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని
హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి
సిగ్గులు దోసిట దూయకు
నా సిగ్గులు దోసిటదూయకు
నీ చేతుల బందీ చేయకు
నీ చేతుల బందీ చేయకు
మెల్లగ లోలో నవ్వకు
మెలమెల్లగ లోలో నవ్వకు
చలచల్లగ పిడుగులు రువ్వకు
చల్లగ పిడుగులు రువ్వకు
ఎవరన్నారివి కన్నులని
అరెరె మధువొలికే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని
హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి
అడుగున అడుగిడుటెందుకు?
నా అడుగున అడుగిడుటెందుకు?
నువు తడబడి పోతున్నందుకు
మరి మరి చూచెదవెందుకు?
నను మరి మరి చూచెదవెందుకు?
నువు మైకం లో ఉన్నందుకు
మైకంలో ఉన్నందుకు
ఎవరన్నారివి కన్నులని
అరెరె మధువొలికే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని
హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి
1 comments:
నారాయణరెడ్డి గారి కలానికి రెండు వైపులా పదునేనండీ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.