ఆదివారం, ఆగస్టు 30, 2015

గువ్వలా ఎగిరిపోవాలీ..

అమ్మకోసం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అమ్మకోసం (1970)
సంగీతం : ఆదినారాయణరావు
సాహిత్యం : సినారె
గానం : బాలు

ఆ హ హా..ఆ ఆ ఆ ఆ ఆఆఅ
ఒ హొ హో..ఓ ఓ ఓ ఓ ఓ ఓఓఓఓ ఓఓఓ
హె హేయ్..గువ్వలా..ఎగిరిపోవాలీ..ఈ ఈ ఈ
ఆ తల్లి గూటికే..ఏ ఏ ఏ..చేరుకోవాలీ..ఈ ఈ ఈ

గువ్వలా..ఆ ఆ ఆ..ఎగిరిపోవాలీ..ఈ ఈ ఈ
ఆ తల్లి గూటికే..ఏ ఏ ఏ..చేరుకోవాలీ..ఈ ఈ ఈ


ఇన్నాళ్ళు రగిలేను చెరసాలలో..
మూగ కన్నీరు మిగిలేను కనుపాపలో
ఇన్నాళ్ళు రగిలేను చెరసాలలో..
మూగ కన్నీరు మిగిలేను కనుపాపలో
ఆ కన్నీరు తుడిచే..ఏ ఏ ఏ ఏ
పన్నీరు చిలికే..ఏ ఏ ఏ ఏ ఏ
ఆ కన్నీరు తుడిచే..పన్నీరు చిలికే
చల్లని ఆ చేయి కావాలి
ఆమె చెరణాలపై వాలిపోవాలి

గువ్వలా..ఆ ఆ ఆ..ఎగిరిపోవాలీ..ఈ ఈ ఈ
ఆ తల్లి గూటికే..ఏ ఏ ఏ..చేరుకోవాలీ..ఈ ఈ ఈ


జగమంత ఒకవింత చదరంగము
పాడు విధియేమో..కనరాని సుడిగుండము
జగమంత ఒకవింత చదరంగము
పాడు విధియేమో..కనరాని సుడిగుండము
ఆ లోతులు చూచీ..ఈ ఈ ఈ
రీతులు తెలిసి..ఈ ఈ ఈ
ఆ లోతులు చూచీ..రీతులు తెలిసి
అలలాగ చెలరేగి పోవాలీ
నేననుకొన్న గమ్యం చేరాలీ

గువ్వలా..ఆ ఆ ఆ..ఎగిరిపోవాలీ..ఈ ఈ ఈ
ఆ తల్లి గూటికే..ఏ ఏ ఏ..చేరుకోవాలీ..ఈ ఈ ఈ


2 comments:

బాలుగారి గొంతుభలే లేతగా ఉంటుందీ పాటలో..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.