సోమవారం, ఆగస్టు 03, 2015

పూలనే కునుకెయ్యమంట...

శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ చిత్రంలో రహ్మాన్ స్వరపరచిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఐ (మనోహరుడు)  (2015)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : అనంత శ్రీరామ్
గానం : హరిచరణ్, శ్రేయాఘోషల్

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
 

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
 
హే ఐ అంటే మరి నేనను అర్ధము తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా
హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా... తనువచ్చెనంటా
 
పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా

అసలిపుడు నీకన్న ఘనుడు లోకాన కనబడునా మనిషై
అదిజరగదని ఇలా అడుగువేసినా నిను వలచిన మనసై

ప్రతి క్షణము క్షణము నీ అణువుఅణువులను కలగన్నది నా ఐ
ఇన్ని కలల ఫలితమున కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై
నా చేతిని వీడని గీత నువ్వై నా గొంతుని వీడని పేరువి నువ్వై
తడిపెదవుల తళుకవనా నవ్వు నవ్వనా ఎంత మధురం

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
హే ఐ అంటే మరినేనను అర్ధము తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా
హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా... తనువచ్చెనంటా

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా

నీరల్లే జారేవాడే నాకోసం ఒక ఓడయ్యడా
నీడంటు చూడనివాడే నన్నే దాచిన మేడయ్యడా
 
నాలోన వుండే వేరొక నన్నే నాకే చూపించిందా
నారాతి గుండెని తాకుతు శిల్పంగా మార్చేసిందా
యుగములకైనా మగనిగ వీణ్ణే పొగడాలి
అంటూ ఉంది నాలో మనసివ్వాళే
ప్రతి ఉదయానా తన వదనాన్నే
నయనము చూసేలాగా వరమేదైనా కావాలే

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
హే ఐ అంటే మరినేనను అర్ధము తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా 
హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా... తనువచ్చెనంటా

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా


2 comments:

చక్కని సాహిత్యం. పంచుకున్నందుకు ధన్యవాదాలు.

థాంక్స్ గౌరి శంకర్ గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.