ఆదివారం, ఆగస్టు 02, 2015

ప్రేమించి పెళ్ళి చేసుకో...

ఆనాటి నుండి ఈ నాటివరకూ తరాలు మారినా యువతరానికి నచ్చే పదం మాత్రం ప్రేమ ఒక్కటే అందుకే వాళ్ళని ఆకట్టుకోవడానికి ఈ కుర్రవాడు ఈ చక్కని పాట సాయంతో ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాడో మీరే చూడండి.  ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆత్మగౌరవం (1966)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం :
గానం : ఘంటసాల

ఓ సోదరసోదరీమణులారా...
ఆదరించి నా మాట వింటారా...
వింటాం చెప్పు..

ప్రేమించి పెళ్ళి చేసుకో...
నీ మనసంతా హాయి నింపుకో...
ప్రేమించి పెళ్ళి చేసుకో...

ప్రేమించి పెళ్ళి చేసుకో...
నీ మనసంతా హాయి నింపుకో...
ప్రేమించి పెళ్ళి చేసుకో...


వరుని వలపేమిటో వధువు తలపేమిటో
తెలుసుకోలేక పెళ్ళిళ్ళు జరిపించినా...
వరుని వలపేమిటో వధువు తలపేమిటో
తెలుసుకోలేక పెళ్ళిళ్ళు జరిపించినా...
తెలిసి కట్నాలకై బతుకు బలి చేసినా
కడకు మిగిలేది ఎడమోము పెడమోములే....

ప్రేమించి పెళ్ళి చేసుకో...
నీ మనసంతా హాయి నింపుకో...
ప్రేమించి పెళ్ళి చేసుకో..
.

మనిషి తెలియాలిలే... మనసు కలవాలిలే
మరచిపోలేని స్నేహాన కరగాలిలే....
మనిషి తెలియాలిలే... మనసు కలవాలిలే
మరచిపోలేని స్నేహాన కరగాలిలే.
మధురప్రణయాలు మనువుగా మారాలిలే....
మారి నూరేళ్ళ పంటగా వెలగాలిలే....

ప్రేమించి పెళ్ళి చేసుకో...
నీ మనసంతా హాయి నింపుకో...
ప్రేమించి పెళ్ళి చేసుకో...


నలుడు ప్రేమించి పెళ్ళాడె దమయంతిని
వలచి రుక్మిణియే పిలిపించె శ్రీకృష్ణుని...
నలుడు ప్రేమించి పెళ్ళాడె దమయంతిని
వలచి రుక్మిణియే పిలిపించె శ్రీకృష్ణుని.....
తొలుత మనసిచ్చి మనువాడె దుష్యంతుడు....
పాత ఒరవళ్ళు దిద్దాలి మీరందరూ...

ప్రేమించి పెళ్ళి చేసుకో...
నీ మనసంతా హాయి నింపుకో...
ప్రేమించి పెళ్ళి చేసుకో...


1 comments:

పెళ్ళి లేని ప్రేమ మనగలదేమో కానీ ప్రేమ లేని పెళ్ళి..ఊహూ..నిలవదనిపిస్తుంది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.