సాలూరి రాజేశ్వరరావు గారి స్వరసారధ్యంలో వచ్చిన ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : ఆరుద్ర
గానం : సుశీల, కోరస్
ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కలకల కిలకిల నవ్వులతో
గాజులు గలగలలాడ
ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కలకల కిలకిల నవ్వులతో
గాజులు గలగలలాడ
తళ తళ తళ తళ మెరిసే సొగసు
ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ
తళ తళ తళ తళ మెరిసే సొగసు
ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ
పరువము వేసిన పందిరిలో
బుజబుజ రేకులు పూయవలె
పరువము వేసిన పందిరిలో
బుజబుజ రేకులు పూయవలె
ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ
ఒప్పులకుప్ప.. వయ్యారి భామా
సన్నబియ్యం.. ఛాయపప్పు
చిన్నమువ్వ.. సన్నగాజు
కొబ్బరికోరు.. బెల్లప్పచ్చు
గూట్లో రూపాయ్.. నీ మొగుడు సిపాయ్
రోట్లో తవుడు.. నీ మొగుడెవడు
హహహహ హహహ హాహహహహహ
ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె
ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె
ఆ..ఆ..ఆ..ఆ... ఓ..ఓ..ఓ..ఓ...
ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ
ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ
1 comments:
చిన్నప్పుడాడిన గొబ్బిళ్ళ పాటలూ..అట్లతద్ది ఆటలూ గుర్తొస్తున్నాయి..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.