మంగళవారం, సెప్టెంబర్ 23, 2014

What a waiting...

"అందమైన అనుభవం" సినిమా కోసం బాలచందర్ గారు సింగపూర్ లోని జురాంగ్ బర్డ్ పార్క్ లో చిత్రీకరించిన ఈపాట చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే గిటార్ పై లైట్ గా సాగే సంగీతం మనసుకు హాయైన అనుభూతిని ఇస్తుంది. నాకు చాలా ఇష్టమైన ఈ పాటను మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అందమైన అనుభవం (1979)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం: బాలు

What a waiting
What a waiting
Lovely birds tell my darling
You were watching you were watching
Love is but a game of waiting

కాచుకొంటి కాచుకొంటి 
కళ్ళు కాయునంతదాక 
చెప్పవమ్మ చెప్పవమ్మ 
చుప్పనాతి రామచిలక
మొక్కనాటి కాచుకున్న 
మొగ్గ తొడిగి పూచేనమ్మా
ఆమె రాదు ఆమె రాదు 
ప్రేమ లేదో అడగవమ్మ

What a waiting
What a waiting
Lovely birds tell my darling
You were watching you were watching
Love is but a game of waiting

కాచుకొంటి కాచుకొంటి 
కళ్ళు కాయునంతదాక 
చెప్పవమ్మ చెప్పవమ్మ 
చుప్పనాతి రామచిలక


2 comments:

"మొక్కనాటి కాచుకున్న..మొగ్గ తొడిగి పూచేనమ్మా
ఆమె రాదు ఆమె రాదు..ప్రేమ లేదో అడగవమ్మ"
ఇంత అందం గా విరహాన్ని వర్ణించడం మనసుకవి కాక మరెవరివల్లౌతుంది చెప్పండి..అందులోనూ అంత అందమైన భావాలకి రూపశిల్పి బాలచందర్ గారైతే..చెప్పేదేముంది..

వెల్ సెడ్ శాంతి గారు... థాంక్స్ ఫర్ ద కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.