బుధవారం, సెప్టెంబర్ 24, 2014

సకల కళా వల్లభుడా...

ప్రేమ, పెళ్ళి అంటే తనకి అసహ్యమంటూనే చివరికి ఒక డాక్టర్ ను ప్రేమించి పెళ్ళి చేసుకునే పాత్రలో ఆద్యంతం హాస్యాన్ని పండించిన కమల్ హాసన్ 'బ్రహ్మచారి' సినిమాకి పెద్ద ఎసెట్. పూర్తిగా హాస్యం మీదే ఆధారపడి నడిచే ఈ సినిమాలోని ఈ ప్రేమగీతం నాకు నచ్చిన పాటలలో ఒకటి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : బ్రహ్మచారి (2002)
సంగీతం : దేవా
రచన : శివ గణేష్
గానం : శ్రీనివాస్, సుజాత

సకల కళా వల్లభుడా సరసం కోరే స్నేహితుడా 
సకల కళా వల్లభుడా సరసం కోరే స్నేహితుడా
నా కథలో నాయకుడా నా మదిలో మన్మధుడా
నువ్వు పెనవేస్తే శృంగారవీణ పదే పదే మోగాలా
కలవా చెలీ కానుకవా మదినే గిచ్చే మల్లికవా

కన్నె వన్నె చూసి కలుగు భావమేది
కళ్ళలోన ప్రేమా? కామమా? ఏదీ ఏదీ
కమ్మనైన స్నేహం గుండె నిండుతుంటే
కాలమంత వెలిగే బంధమే అది అదీ
ఆ మాటే చాలంట నీ మనసుకి బానిసనవుతా
నీ రాజ్యం ఏలేస్తా నీ శ్వాసై నిత్యం నిన్నే ప్రేమిస్తా

రాయి వంటి నాలో రాగాలొలికినావే
రాయభారమింకా ఎందుకే అహొ ప్రియా ప్రియా
వేసవంటి నేను వెన్నెలైన వేళా
హాయి భారం తీరేటందుకే మహాశయా
నీ జోరే సెలయేరై నను నీలో ముంచెయ్యలా
నీ జ్వాలే నా చీరై నా తనువే కాగి వేగిపోవాలా

సకల కళా వల్లభుడా సరసం కోరే స్నేహితుడా
నా కథలో నాయకుడా నా మదిలో మన్మధుడా
నను ఒడిచేర్చి నిను పంచువేళ ప్రాయం ప్రాణం ఊగాలా

2 comments:

బ్రహ్మచారి, తెనాలి, భామనే సత్యభామనే, ముంబై ఎక్స్ ప్రెస్,ఇలా ఓ టైం లో కమల్ వి అన్నీ హిలీరియస్ కామెడీస్..ఇంచుమించుగా వీటన్నిటికీ సంభాషణలు క్రేజీ మోహన్ గారే అనుకుంటా..అందుకే హాస్యం అంత అద్భుతంగా పండిందనిపిస్తుంది..

అవును శాంతిగారు అవన్నీ కూడా సూపర్ కామెడీ సినిమాలు నాకూ చాలా ఇష్టం..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.