అర్ధాంగి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అర్థాంగి (1955)
సంగీతం : బి.నరసింహరావు.ఎమ్.వేణు
రచన : ఆత్రేయ
గానం : ఘంటసాల
ఇంటికి దీపం ఇల్లాలే
ఇంటికి దీపం ఇల్లాలే ఇల్లాలే
సుఖాల పంటకు జీవం ఇల్లాలే ఇల్లాలే
ఇంటికి దీపం ఇల్లాలే
కళకళలాడుతు కిలకిల నవ్వుతు
కళకళలాడుతు కిలకిల నవ్వుతు
బ్రతుకే స్వర్గము అనిపించునుగా
బ్రతుకే స్వర్గము అనిపించునుగా
పతికే సర్వము అర్పించునుగా
ఇంటికి దీపం ఇల్లాలే
నాధుని తలలో నాలుక తీరున
నాధుని తలలో నాలుక తీరున
మంచి చెడులలో మంత్రి అనిపించును
మంచి చెడులలో మంత్రి అనిపించును
అభిరుచి తెలిసీ - ఆకలి నెరిగీ
అభిరుచి తెలిసీ - ఆకలి నెరిగీ
అన్నము పెట్టే అమ్మను మించునూ.
అభిరుచి తెలిసీ - ఆకలి నెరిగీ
అన్నము పెట్టే అమ్మను మించును
సహచర్యములో, పరిచర్యలలో
సహచర్యములో, పరిచర్యలలో
దాసిగా తరింప జూచుచు
దాసిగా తరింప జూచుచు
దయావాహిని - ధర్మరూపిణి
భారత మానిని - భాగ్యదాయినీ
2 comments:
దీపమంటి పాట..
బాగా చెప్పారండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.