శుక్రవారం, నవంబర్ 11, 2016

తులసి కోటలో...

క్షీరాబ్ది ద్వాదశి సందర్బంగా మూడు ముళ్ళ బంధం చిత్రంలోని ఈ పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.

చిత్రం : మూడుముళ్ళబంధం (1980)
సంగీతం : సత్యం
సాహిత్యం :
గానం : సుశీల

తులసి కోటలో వెలిగే దీపం
మాంగల్యానికి మరో రూపం
తులసి కోటలో వెలిగే దీపం
మాంగల్యానికి మరో రూపం
అర్చనలైనా అర్పణలైనా
ఆ మాంగల్యం కోసం
ఆ మాంగల్యం కోసం

మూడుముళ్ళ బంధం
ఏడేడు జన్మల బంధం
ఆ దారం విలువ ఎంతా
ఒక నిండు జీవితమంతా
ఒక నిండు జీవితమంతా

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ సంధర్బంగా శ్రీరామదాసు చిత్రంలోని ఓ చక్కని శ్రీరామ కీర్తనని కూడా తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.

చిత్రం : శ్రీరామదాసు (2006)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : శ్రీరామదాసు
గానం : ప్రణవి

శుద్దబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా
శుద్దబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా

శేషతల్ప సుఖ నిద్రిత రామా ..బ్రహ్మాద్యమరా ప్రార్ధిత రామా
శేషతల్ప సుఖ నిద్రిత రామా ..బ్రహ్మాద్యమరా ప్రార్ధిత రామా

రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా
రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా

ప్రియ గుహ వినివేదిత పద రామా..శబరీ దత్త ఫలాశన రామా
ప్రియ గుహ వినివేదిత పద రామా..శబరీ దత్త ఫలాశన రామా

హనుమత్సేవిత నిజపద రామా..సీతా ప్రాణా ధారక రామా
రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా
రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా

శుద్దబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా
శుద్దబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామ

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.