మంగళవారం, నవంబర్ 08, 2016

నా జీవన సంధ్యా సమయంలో...

సత్యం గారి మధురమైన సంగీతం వైవిధ్యమైన రామకృష్ణ గారి గళం కలగలసి అందాన్ని చేకూర్చిన ఒక చక్కని వేటూరి గారి సాహిత్యం ఈ రోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.చిత్రం : అమరదీపం (1977)
సంగీతం : సత్యం
సాహిత్యం : వేటూరి
గానం : రామకృష్ణ, సుశీల

నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది
ఆ రూపమే అపురూపమై
అమరదీపమై వెలిగింది

నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది

ఆఆఆ..ఆఆ.ఆఆఆఅ.ఆ.ఆఆ...

శిలకే కదలిక రాగా శిల్పమే కదలి ఆడింది
గరిసా సదపమా గమద మదని
దనిరిని గరిగరిసా సదసదపా మపగా
కళకే కళగా విరిసి నా కల నిజమై పండింది
శిలకే కదలిక రాగా శిల్పమే కదలి ఆడింది
కళకే కళగా విరిసి నా కల నిజమై పండింది
ఆరు ఋతువుల ఆమని కోయిల
మనసే ఎగసి పాడింది

నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది

పొద్దుపొడుపులో అరుణిమలే
చెలి దిద్దు తిలకమై చివురించే
ఇంద్రధనుస్సులో రిమరిమలే
చెలి పైట జిలుగులే సవరించే
ఆ చల్లని చూపుల ఊపిరి సోకిన
ఆఆఆ..ఆఆ.ఆఆఆఅ.ఆ.ఆఆ...
ఆ చల్లని చూపుల ఊపిరి సోకిన
వెదురు వేణువై పలికింది

నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది

పలుకే పాడని పాట చిరునవ్వు పూలకే పూత
గరిసా సదపమా గమద మదని
దనిరిని గరిగరిసా సదసదపా మపగా
నడకే నెమలికి ఆట లే నడుము కలలకే కవ్వింత
కలలుగన్న నా శ్రీమతి రాగా
ఈ బ్రతుకే పరిమళించింది

నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది
ఆ రూపమే అపురూపమై
అమరదీపమై వెలిగింది
నా జీవన సంధ్యా సమయంలో
ఒక దేవత ఉదయించింది

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.