మంగళవారం, జూన్ 30, 2020

కన్నుల్లో మిసమిసలు...

దేవత చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : దేవత (1965)
సంగీతం : కోదండపాణి 
సాహిత్యం : వీటూరి
గానం : ఘంటసాల, సుశీల 

కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
గుండెల్లో గుసగుసలు వినిపించనీ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ

నీ చూపుతో నన్ను ముడివేయకు
ఈ పూలు వింటాయి సడిచేయకు
నీ చూపుతో నన్ను ముడివేయకు

సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది
నాపైట చెంగులాగి కవ్వించకు
సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది
నాపైట చెంగులాగి కవ్వించకు

అనువైనవేళ అందాలు దాచకు
అనువైనవేళ అందాలు దాచకు
అణువణువు నిన్నే కోరె మురిపించకు
ఇకనైనా నిను సిగ్గు తెరవేయకూ

నీ చూపుతో నన్ను ముడివేయకు
ఈ పూలు వింటాయి సడిచేయకు
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ..ఈ..

ఎటు చూసినా నువ్వే వినిపించె నీ నవ్వే
మొహాలతో నన్ను మంత్రించకు
ఎటుచూసినా నువ్వే వినిపించె నీ నవ్వే
మొహాలతో నన్ను మంత్రించకు

మనలోని ప్రేమ మారాకు వేయనీ 
మనలోని ప్రేమ మారాకు వేయనీ
మనసార ఒడిలో నన్ను నిదురించనీ
నీ నీలి ముంగురులు సవరించనీ

నీ చూపుతో నన్ను ముడివేయకు
ఈ పూలు వింటాయి సడిచేయకు

కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
గుండెల్లో గుసగుసలు వినిపించనీ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ..ఈ..
 

2 comments:

థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.