మన్మథుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మన్మధుడు (2002)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఎస్.పి.చరణ్
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
పూల చెట్టు ఊగినట్టు
పాల బొట్టు చిందినట్టు
అల్లుకుంది నా చుట్టు ఓ చిరునవ్వు
తేనె పట్టు రేగినట్టు
వీణ మెట్టు ఒణికినట్టు
ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు
నా మనసుని మైమరపున
ముంచిన ఆ వాన
మీకెవరికి కనిపించదు ఏమైనా
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
చుట్టుపక్కలెందరున్నా
గుర్తు పట్టలేక ఉన్నా
అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే
తప్పు నాది కాదు అన్నా
ఒప్పుకోరు ఒక్కరైనా
చెప్పలేను నిజమేదో నాకూ వింతే
కళ్ళను వదిలెళ్ళను
అని కమ్మిన మెరుపేదో
చెప్పవ కనురెప్పలకే మాటొస్తే
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
2 comments:
హార్ట్ టచింగ్ సాంగ్..
అవునండీ.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.. చాలా రోజులుగా మీ కామెంట్స్ మిస్ అవుతూ ఉన్నాను :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.