మర్యాద రామన్న చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మర్యాదరామన్న (2010)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : అనంత్ శ్రీరాం
గానం : కీరవాణి, గీతామాధురి
రాయలసీమ మురిసి పడేలా
రాగలవాడి జన్మ తరించేలా
ముత్యమంటి సొగసే మూట గట్టుకుంది
మూడుముళ్ళు వేయమందీ
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
కళ్ళల్లో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
అందుకోమన్నది నిన్ను తన చేయి
పలికే పలుకుల్లో వొలికే తొలకరి
ఇంట్లో కురిసిందో సిరులే మరి
నవ్వే నవ్వుల్లో తుళ్లే లాహిరి
జంటై కలిసిందో కలతే హరీ
హంసల నడకల వయ్యారి ఆయినా
ఏడడుగులు నీ వెనకే
ఆశల వధువుగ ఇలాగ ఇలపై
జారిన జాబిలి తునకే
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
కళ్ళల్లో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
అందుకోమన్నది నిన్ను తన చేయి
ఏహ ఆపండహే ఎదవ గోల
రోజు పిచ్చి గీతలు
గీసుకుంటు కూర్చుంటుంది
దాన్ని నే చేసుకోవాలా
గీతలే ఆని చిన్న చూపెందుకు
వాటి లోతులు చూడలేరెందుకు
నదిలో పడవలా, వానలో గొడుగులా
గువ్వపై గూడులా, కంటిఫై రెప్పలా
జతపడే జన్మకీ తోడు ఉంటానని
మనసులో మాటనీ
మనకు చెప్పకనే చెబుతుంది
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
గుండెనే కుంచెగ మలచిందోయి
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
అందుకో మన్నది నిన్ను తనచేయి
2 comments:
తెలుగమ్మాయి అనే పదం ఫస్ట్ టైం విన్నప్పుడు భలే నచ్చేసింది..
అవునండీ నాక్కూడా.. ఈ పాట నా ఫేవరెట్ సాంగ్స్ లో ఒకటి.. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.