నర్తనశాల చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం: నర్తనశాల (1963)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం : సముద్రాల (జూనియర్)
గానం : సుశీల
దరికి రాబోకు రాబోకు రాజా
దరికి రాబోకు రాబోకు రాజా
ఓ... తేటి రాజా, వెర్రి రాజా
దరికి రాబోకు రాబోకు రాజా
మగువ మనసు కానగలేవో
తగని మారాలు మానగ లేవో
మగువ మనసు కానగలేవో
తగని మారాలు మానగ లేవో
నీకీనాడే మంగళమౌరా
నీకీనాడే మంగళమౌరా
ఆశా ఫలించీ తరించేవులే..ఏ..
దరికి రాబోకు రాబోకు రాజా
దరికి రాబోకు రాబోకు రాజా
మరుని శరాలా తెలివి మాలీ
పరువు పోనాడి చేరగ రాకోయ్
మరుని శరాలా తెలివి మాలీ
పరువు పోనాడి చేరగ రాకూ
నీవేనాడు కననీ విననీ
నీవేనాడు కననీ విననీ
శాంతి సుఖాల తేలేవులే..ఏ..
దరికి రాబోకు రాబోకు రాజా
దరికి రాబోకు రాబోకు రాజా
ఓ... తేటి రాజా... వెర్రి రాజా
దరికి రాబోకు రాబోకు రాజా
2 comments:
ఇద్దరివీ అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్..
అవునండీ.. ఇద్దరికిద్దరే.. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.