శుక్రవారం, జూన్ 12, 2020

సన్నాజాజికి గున్నామావికి...

ముత్యాల పల్లకి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం: ముత్యాల పల్లకి (1976)
సంగీతం : సత్యం
సాహిత్యం : మల్లెమాల
గానం : బాలు, సుశీల

సన్నాజాజికి గున్నామావికి
పెళ్ళికుదిరిందీ
మాటా మంతీ లేని
వేణువు పాట పాడిందీ
సన్నాజాజికి గున్నామావికి
పెళ్ళికుదిరిందీ
మాటా మంతీ లేని
వేణువు పాట పాడిందీ
హాహహా ఆ ఆ...హాహహా ఆ ఆ...


గున్నా మావికి సన్నా జాజికి
పెళ్ళి కుదిరిందీ..
నాదే గెలుపని మాలతీ లత
నాట్యమాడిందీ..
గున్నా మావికి సన్నా జాజికి
పెళ్ళి కుదిరిందీ..
నాదే గెలుపని మాలతీ లత
నాట్యమాడిందీ..
ఆహాఆహహా ఆ ఆ...ఓహో.హోహ్హో...

పూచే వసంతాలు మా కళ్ళలో
పూలే తలంబ్రాలు మా పెళ్ళిలో
పూచే వసంతాలు మా కళ్ళలో
పూలే తలంబ్రాలు మా పెళ్ళిలో
విరికొమ్మా.. చిరు రెమ్మా..
విరికొమ్మా చిరు రెమ్మా
పేరంటానికి రారమ్మా


సన్నాజాజికి గున్నామావికి
పెళ్ళికుదిరిందీ
మాటా మంతీ లేని
వేణువు పాట పాడిందీ
హాహహా ఆ ఆ...హాహహా ఆ ఆ..
.

కలలే నిజాలాయె ఈ నాటికీ
అలలే స్వరాలాయె మా పాటకీ
కలలే నిజాలాయె ఈ నాటికీ
అలలే స్వరాలాయె మా పాటకీ
శ్రీరస్తూ...శుభమస్తూ..
శ్రీరస్తు శుభమస్తు
అని మీరూ మీరు దీవించాలి

సన్నాజాజికి గున్నామావికి
పెళ్ళికుదిరిందీ
నాదే గెలుపని మాధవీ లత
నాట్యమాడిందీ
సన్నాజాజి కి గున్నా మావికి
పెళ్ళికుదిరిందీ

 

2 comments:

యెవ్వర్ గ్రీన్ సాంగ్

నిస్సందేహంగానండీ.. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.