శనివారం, జూన్ 20, 2020

ఈ కోవెల నీకై...

అండమాన్ అమ్మాయి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 
 

చిత్రం : అండమాన్ అమ్మాయి (1979)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : సుశీల, బాలు

ఈ కోవెల నీకై వెలిసింది 
ఈ వాకిలి నీకై తెరిచింది
రా దేవి తరలి రా 
నా దేవి తరలి రా

ఈ కోవెల నీకై వెలిసింది 
ఈ వాకిలి నీకై తెరిచింది
రా స్వామీ తరలి రా 
నా స్వామి తరలి రా 
 
దేవత గుడిలో లేకున్నా 
దీపం పెడుతూ ఉన్నాను
దేవత గుడిలో లేకున్నా 
దీపం పెడుతూ ఉన్నాను
తిరునాళ్ళెపుడో రాక తప్పదని 
తేరును సిద్ధం చేసాను
 
దేవుడు వస్తాడని రోజూ 
పూవులు ఏరి తెస్తున్నాను
దేవుడు వస్తాడని రోజూ 
పూవులు ఏరి తెస్తున్నాను
రేపటి కోసం చీకటి మూసిన 
తూరుపులాగా ఉన్నాను
తూరుపులాగా ఉన్నాను
 
ఈ కోవెల నీకై వెలిసింది
ఈ వాకిలి నీకై తెరిచింది

మాసిన వెచ్చని కన్నీరూ 
వేసెను చెంపల ముగ్గులను 
మాయని తీయని మక్కువలు 
చూసెను ఎనిమిది దిక్కులను 

దిక్కులన్నీ ఏకమై 
నాకొక్క దిక్కై నిలిచినది 
మక్కువలన్నీ ముడుపులు కట్టి 
మొక్కులుగానే మిగిలినవి 
మొక్కులుగానే మిగిలినవి 

ఈ కోవెల నీకై వెలిసింది
ఈ వాకిలి నీకై తెరిచింది

నీరు వచ్చే ఏరు వచ్చే
ఏరు దాటే ఓడ వచ్చే
నీరు వచ్చే ఏరు వచ్చే
ఏరు దాటే ఓడ వచ్చే
ఓడ నడిపే తోడు దొరికే 
ఒడ్డు చేరే రోజు వచ్చే
 
ఓడ చేరే రేవు వచ్చే 
నీడ చూపే దేవుడొచ్చే
ఓడ చేరే రేవు వచ్చే 
నీడ చూపే దేవుడొచ్చే
రేవులోకి చేరేలోగా 
దేవుడేదో అడ్డువేసే
ఆ..దేవుడేదో అడ్డువేసే
 
ఈ కోవెల నీకై వెలిసింది 
ఈ వాకిలి నీకై తెరిచింది
రా దేవి తరలి రా 
నా స్వామీ తరలి రా
రా దేవి తరలి రా 
నా స్వామీ తరలి రా 
 

2 comments:

థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.