శనివారం, జూన్ 27, 2020

విరిసిన మరుమల్లి...

రైతుబిడ్డ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : రైతు బిడ్డ (1971)
సంగీతం : ఎస్. హనుమంతరావు
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల  

దిక్కులను చూసేవు 
దిగులుగా నిలిచేవు
అనుకున్న కబురందలేదాఆ
ఎందుకమ్మాయి నీకింత బాధా

ఓ..ఓ.. విరిసిన మరుమల్లి 
జరుగును మన పెళ్ళీ
విరిసిన మరుమల్లి 
జరుగును మన పెళ్ళీ
ముత్యాల పందిరిలోనా.. ఆ.. ఆ..
మురిపాల సందడిలోనా 
మురిపాల సందడిలోనా 

విరిసిన మరుమల్లి 
జరుగును మన పెళ్ళీ
ముత్యాల పందిరిలోనా.. ఆ.. ఆ..
మురిపాల సందడిలోనా 
మురిపాల సందడిలోనా  

అమ్మగారి దీవెనలు అందుకున్నారా
అన్నగారు అందుకు సరేనాన్నారా
..ఓ.....ఓ.. ఆ..... ఆ....
అమ్మగారి దీవెనలు అందుకున్నారా
అన్నగారు అందుకు సరేనాన్నారా
మనసు కనుగోన్నారు..
ప్రణయ కథ విన్నారు
మనసు కనుగోన్నారు..
ప్రణయ కథ విన్నారు
మనల మన్నించారు 
మనువు కుదిరించారు

ఓ......ఓ.....ఆ.....ఆ.....
విరిసిన మరుమల్లి 
జరుగును మన పెళ్ళీ
ముత్యాల పందిరిలోనా
మురిపాల సందడిలోనా 
మురిపాల సందడిలోనా 

ఆ..అ.....ఆ......ఆ....
ఓ.......ఓ.....ఓ.......ఓ.....
పెళ్ళితోనే బులపాటం చెల్లునంటావా
కళ్ళలోన కలకాలం దాచుకుంటావా 
పెళ్ళితోనే బులపాటం చెల్లునంటావా
కళ్ళలోన కలకాలం దాచుకుంటావా 

వలచి కాదంటానా 
కలసి విడిపోతానా
వలచి కాదంటానా 
కలసి విడిపోతానా
ఏకమై ఉందామూ 
ఎన్ని జన్మలకైనా
ఓ...ఓ....ఓ....ఓ....ఓ...

విరిసిన మరు మల్లి
జరుగును మన పెళ్ళీ
ముత్యాల పందిరిలోనా 
మురిపాల సందడిలోనా
మురిపాల సందడిలోనా 
 
 

4 comments:

మంచి పాట.చరణాలలో ప్రశ్న జవాబు లతో పాట వ్రాయడం సినారె గారి మార్కు కనిపిస్తుంది.

అవునండీ.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్..

నైస్ సాంగ్..

థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.