శుక్రవారం, జూన్ 19, 2020

గోరొంక గూటికే...

దాగుడు మూతలు చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : దాగుడుమూతలు (1964)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : దాశరథి
గానం : ఘంటసాల

గోరొంకగూటికే చేరావు చిలకా
గోరొంకగూటికే చేరావు చిలకా
భయమెందుకే నీకు బంగారుమొలకా
గోరొంకగూటికే చేరావు చిలకా

ఏ సీమదానవో ఎగిరెగిరి వొచ్చావు
అలసివుంటావు మనసు చెదరివుంటావు
ఏ సీమదానవో ఎగిరెగిరి వొచ్చావు
అలసివుంటావు మనసు చెదరివుంటావు
మా మల్లెపూలు నీకు మంచికథలు చెప్పునే
మా మల్లెపూలు నీకు మంచికథలు చెప్పునే
ఆదమరిచి ఈ రేయి హాయిగా నిదురపో 
 
గోరొంకగూటికే చేరావు చిలకా
భయమెందుకే నీకు బంగారుమొలకా
గోరొంకగూటికే చేరావు చిలకా 
 
నిలవలేని కళ్ళు నిదరపొమ్మన్నాయి
దాగని చిరునవ్వులు వద్దన్నాయీ 
అబ్బ! ఉండన్నాయీ
నిలవలేని కళ్ళు నిదరపొమ్మన్నాయి
దాగని చిరునవ్వులు వద్దన్నాయీ 
అబ్బ! ఉండన్నాయీ
పైటచెంగు రెపరెపలు పదపద లెమ్మన్నాయి
పైటచెంగు రెపరెపలు పదపద లెమ్మన్నాయి
పలుకైనా పలుకవా బంగారు చిలకా

గోరొంకగూటికే చేరావు చిలకా
భయమెందుకే నీకు బంగారుమొలకా
గోరొంకగూటికే చేరావు చిలకా 
 

2 comments:

అందమైన పాట..అందమైన పిక్..

థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.