శనివారం, జూన్ 13, 2020

జోలాజోలమ్మజోలా...

సూత్రధారులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం: సూత్రధారులు (1989)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సినారె 
గానం : శైలజ 
 
జోలాజోలమ్మజోలా 
జేజేలాజోలా 
జేజేలా జోలా
నీలాలా కన్నులకు 
నిత్యమల్లే పూల జోలా 
నిత్యమల్లే పూల జోలా

జోలాజోలమ్మజోలా 
జేజేలాజోలా 
జేజేలా జోలా

నీలాలా కన్నులకు 
నిత్యమల్లే పూల జోలా 
నిత్యమల్లే పూల జోలా

లొలొలొలొలొ హాయి. హాయే 
లొలొలొలొలొ హాయి. హాయే

ఆ.ఆ. రేపల్లే గోపన్నా 
రేపు మరచి నిదరోయే 
రేపు మరచి నిదరోయే
యాదగిరి నరసన్నా 
ఆదమరచి నిదరోయే 
ఆదమరచి నిదరోయే

ఏడుకొండల ఎంకన్నా 
ఎప్పుడనగా నిదరోయే 
ఎప్పుడనగా నిదరోయే
కోడె పిల్లాడా నీకేమో 
కునుకైనా రాదాయే కునుకైనా

లొలొలొలొలొ హాయి హాయే 
లొలొలొలొలొ హాయి హాయే

జోలాజోలమ్మజోలా 
జేజేలా జోలా జేజేలా జోలా

నీలాలా కన్నులకు 
నిత్యమల్లే పూల జోలా 
నిత్యమల్లే పూల జోలా

మీనావతారమెత్తి 
మేని చుట్టు రాబోకురా
అరెరెరెరె యాహి యాహి యాహి 
యాహి యాహి యాహి
యాహి యాహి యాహి 
యాహి యాహి యాహి

కృష్ణావతారమెత్తి 
కోకలెత్తుకు పోబోకురా
అయ్యయయ్యో యాహి యాహి యాహి 
యాహి యాహి యాహి
హా హా హ హా హా. హాహాహాహా

వామనావతారమెత్తి 
వామనావతారమెత్తి 
సామిలాగా ఐపోకు
బుద్ధావతారమెత్తి 
బోధి చెట్టుని అంటి ఉండకు
రఘు వంశ తిలకుడివై 
రాముడివై రమణుడివై 
రాముడివై రమణుడివై
సీతతోనే ఉండిపోరా 
గీత నువ్వే దిద్దిపోరా
ఈ సీతతోనే ఉండిపోరా 
నా గీత నువ్వే దిద్దిపోరా

లొలొలొలొలొ హాయి హాయే 
లొలొలొలొలొ హాయి హాయే

జోలాజోలమ్మజోలా 
జేజేలా జోలా జేజేలా జోలా

నీలాలా కన్నులకు 
నిత్యమల్లే పూల జోలా 
నిత్యమల్లే పూల జోలా

లొలొలొలొలొ హాయి హాయే 
లొలొలొలొలొ హాయి హాయే 


6 comments:

బ్యూటిఫుల్ రమ్య కృష్ణ..

ఫైన్ పెర్మార్మర్ కూడానండీ.. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారూ..

అది బై డిఫాల్ట్ కదా..

ఊఊ అవునండీ.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ :-)

పాటలే గాక “సూత్రధారులు” సినిమానే మంచి సినిమా అండీ.
బైదివే, “పెర్మార్కర్” అనగానేమి, వేణూశ్రీకాంత్ గారు?

అవును నరసింహారావు గారు సూత్రధారులు మంచి సినిమా. అది టైపో అండీ పెర్ఫార్మర్ అని నా ఉద్దేశ్యం :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.