సోమవారం, జూన్ 29, 2020

మెల్లగా ఊయలే...

రుక్మిణి చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : రుక్మిణి (1997)
సంగీతం : విద్యాసాగర్ 
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు 

మెల్లగా ఊయలే ఊపే గోదారి
చల్లగా జోలలే పాడే ఈ గాలి
అమ్మఒళ్లో విడిచిన పసితనాన్ని 
ఊహకైనా మిగలని జ్ఞాపకాన్ని 
ఇవాళ నాకు గురుతు చేయగా 

మెల్లగా ఊయలే ఊపే గోదారి
చల్లగా జోలలే పాడే ఈ గాలి

క్షేమమా నాయనా అన్నవి ఈ చేలు 
నేస్తమా చేరుకో అన్నవి ఈ పూలు
సొంతమేమో నాకీ పరిసరాలు
పాతవేమో పిలిచే పరిచయాలు
ఏనాటి జన్మబంధమో ఇదీ 

క్షేమమా నాయనా అన్నవి ఈ చేలు 
నేస్తమా చేరుకో అన్నవి ఈ పూలు

ఇదే సినిమాలో హిరోయిన్ ని మొదటి సారి చూసినపుడు హిరో గారి మదిలో చిరు కవితలు మెదులుతుంటాయి అవి కూడా చాలా బావుంటాయి. ఈ కవితలు సిరివెన్నెల తరంగాలు పుస్తకం నుండి తీస్కున్నాను. 

గోదావరిలో ఈతకు వచ్చిన నింగి చందమామా
నా కనులు కలువలై విరిసేలా కనిపించు కన్నెమోమా
లేత సోయగాన్ని తడిమి నీటి కడవ పాపం మేను మరచి వుంది
లేని నడుము మిద తానూ నిలిచాననుకుంది
నేలకి ఎప్పుడూ తెలియదుగా ఆ లేత పాదాల స్పర్శ
వేల హృదయాలు పరుచుకుంటాయి ఆమె కాలికీ ఇలకీ మధ్య

అలా అలా అలా చెలియ నడిచే వేళ
ఆ లయలకు లయే కదా పడిలేచే ప్రతి అల
ఊరేగే ఉహలకెవరు సంకెళ్ళను వేయలేరని అంటే అది అసత్యం
ఉగే ఆ కురులకు మధ్య చిక్కుకున్న ఉహలనడుగు తెలుస్తుంది సత్యం

అ కోల కళ్ళలో నీలిమను చూసి చీకటికి సిగ్గేసి చిన్నబోయింది
కాటుకై గడపలో ఆగిపోయింది
అ నుదుట చెమరించు ప్రతి చెమట ముత్యం
ఎదలోన జడివాన మొదలైన సాక్ష్యం
ముళ్ళనైనా పువ్వులుగా మార్చే సుకుమారం
ఆ పెదవులు పంచుతాయి తిట్లకైనా తియ్యదనం 


2 comments:

గోదావరి భలే అందంగా ఉంది..

అవునండీ.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.