దొంగరాముడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. దొంగరాముడు మ్యూజికల్ హిట్ ఇందులో పాటలన్నీ బావుంటాయి. పెండ్యాల గారి సంగీతం మలయమారుతం లాగా హాయిగా ఉంటుంది. ఈ పాట వింటూంటే ఓ సరదా విషయం జ్ఞాపకం వచ్చింది. రేరాజుని గురించి తెలియని చిన్నతనంలో రేడియోలో ఈ పాట వింటూ ఏంటీ పిల్ల మరీ ఎంత ప్రేమ ఎక్కువైతే మాత్రం రాజుగారిని ఒరే రాజా అని అంటూంది అని ఆశ్చర్యపోయేవాడ్ని :-)
చిత్రం : దొంగరాముడు (1955)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : సుశీల
ఆఅ ఆఅ ఆఆ..
అనురాగము విరిసేనా
ఓ రేరాజా
అనుతాపము తీరేనా
విను వీధినేలే రాజువే
నిరుపేద చెలిపై మనసౌనా
అనురాగము విరిసేనా
ఓ రే రాజా
అనుతాపము తీరేనా
నిలిచేవు మొయిలూ మాటునా
పిలిచేవూ కనులా గీటునా
నిలిచేవు మొయిలూ మాటునా
పిలిచేవూ కనులా గీటునా
పులకించు నాదు డెందము
ఏ నాటి ప్రేమాబంధమో
ఓ రే రాజా
అనురాగము విరిసేనా
మునుసాగే మోహాలేమో
వెనుకాడే సందేహాలేమో
మును సాగే మోహాలేమో
వెనుకాడే సందేహాలేమో
నీ మనసేమొ తేటగా
తెనిగించవయ్య మహరాజా
ఓ రేరాజా
అనురాగము విరిసేనా
విను వీధినేలే రాజువే
నిరుపేద చెలిపై మనసౌనా
అనురాగము విరిసేనా
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : సుశీల
ఆఅ ఆఅ ఆఆ..
అనురాగము విరిసేనా
ఓ రేరాజా
అనుతాపము తీరేనా
విను వీధినేలే రాజువే
నిరుపేద చెలిపై మనసౌనా
అనురాగము విరిసేనా
ఓ రే రాజా
అనుతాపము తీరేనా
నిలిచేవు మొయిలూ మాటునా
పిలిచేవూ కనులా గీటునా
నిలిచేవు మొయిలూ మాటునా
పిలిచేవూ కనులా గీటునా
పులకించు నాదు డెందము
ఏ నాటి ప్రేమాబంధమో
ఓ రే రాజా
అనురాగము విరిసేనా
మునుసాగే మోహాలేమో
వెనుకాడే సందేహాలేమో
మును సాగే మోహాలేమో
వెనుకాడే సందేహాలేమో
నీ మనసేమొ తేటగా
తెనిగించవయ్య మహరాజా
ఓ రేరాజా
అనురాగము విరిసేనా
విను వీధినేలే రాజువే
నిరుపేద చెలిపై మనసౌనా
అనురాగము విరిసేనా
4 comments:
Melody song with simple apt lyrics.
అవునండీ.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్..
మెలోడియస్ సాంగ్..
అవునండీ.. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.