గులేబకావళి కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : గులేబకావళి కథ (1962)
సంగీతం : విజయ కృష్ణమూర్తి
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల
నన్ను దోచుకుందువటే
నన్ను దోచుకుందువటే
వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు
నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి
నన్ను దోచుకుందువటే
తరియింతును నీ చల్లని
చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని
చరణమ్ముల నీడలోన
పూలదండ వోలె
కర్పూర కళికవోలె
కర్పూర కళికవోలె
ఎంతటి నెఱజాణవో
నా అంతరంగమందు నీవు
ఎంతటి నెఱజాణవో
నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని
సంకెలలు వేసినావు
సంకెలలు వేసినావు
నన్ను దోచుకుందువటే
నన్ను దోచుకుందువటే
వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు
నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి
నన్ను దోచుకుందువటే..
నా మదియే మందిరమై
నీవే ఒక దేవతవై
నా మదియే మందిరమై
నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో
నే కలసిపోదు నీలో
కలసిపోదు నీలో
ఏనాటిదొ మనబంధం
ఎరుగరాని అనుబంధం
ఏనాటిదొ మనబంధం
ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైనా
ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం
నన్ను దోచుకుందువటే
నన్ను దోచుకుందువటే
వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు
నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి
నన్ను దోచుకుందువటే
4 comments:
This song is forever. Golden classic song. Dr. Sinare first song.
థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ అజ్ఞాత గారూ..
చాలా ఇష్టమైన పాట..
వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ అండీ.. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.