సోమవారం, జూన్ 15, 2020

ముద్దబంతి పువ్వు...

కౌసల్యా కృష్ణమూర్తి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం: కౌసల్యాకృష్ణమూర్తి (2019)
సంగీతం : దిబు నినన్ థామస్ 
సాహిత్యం : కృష్ణకాంత్  
గానం : యాజిన్ నిజార్ 
 
ముద్దబంతి పువ్వు ఇలా పైట వేసెనా
ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా
నేటికి నేడు మారిన ఈడు చేసె నేరమే
నిద్దుర లేదు ఆకలి లేదు అన్ని దూరమే
చక్కదనాల చుక్కకివాళ దిష్టి తీసి హారతీయనా

అమ్మడివే
(స, ద ని స, ద ని స మా గ మ, గ స
ద ని స, గ గ స, ద ప గ స, గ గ, స ని ద ని స)

కలలను దాచే నా కన్ను నీవే
నిజమైపోవే నావన్ని నీవే
పగలే మెరిసే మిణుగురువే
నగలే వెలిసే వెలుగు నువే
ఇలపై నడిచే మెరుపు నువే 'హా
ఇకపై వరమై దొరుకు నువే

నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే
నేనెపుడూ నీ వెంటే ఉంటా

ముద్దబంతి పువ్వు ఇలా పైట వేసెనా
ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా

పరుగులు తీసే నా రాణి నీవే
పడితే మెత్తని నేలౌతాలే
ఎపుడూ నిలిచే భుజమౌతా
కలను కంటే నిజమౌతా
కష్టం వస్తే కలబడతా 'హా
కడదాకా నే నిలబడతా

అలిసొస్తే జో కొడతా
గెలిచొస్తే జై కొడతా
కలిసొస్తే ఓ గుడినే కడతా

ముద్దబంతి పువ్వు ఇలా పైట వేసెనా
ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా

హోయ్ మౌనంగానే సైగలతోనే ఎంత కాలమే
జాలిని చూపి దగ్గరయ్యేటి దారి చూపవే
ఆపసోపాలే నావిక ఆపే 
ఒక్కసారి చెంత చేరవే
అమ్మడివే
అమ్మడివే

(తందానానే నా)

2 comments:

థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.