శనివారం, డిసెంబర్ 05, 2020

ఏ పారిజాతమ్ములీయగలనో...

ఏకవీర చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే  వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసినది స్వరాభిషేకంలో బాలు గారు పాడిన వీడియో. అది ఇక్కడ చూడవచ్చు. ఏ పారిజాతమ్ములు బిట్ వీడియో ఇక్కడ చూడవచ్చు. కలువ పూల చెంత చేరి బిట్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  


చిత్రం : ఏకవీర (1969) 
సంగీతం : కె.వి.మహదేవన్ 
సాహిత్యం : సినారె 
గానం : బాలు 

ఏ పారిజాతమ్ములీయగలనో.. సఖీ 
గిరి మల్లికలు తప్ప.. గరికపూవులు తప్ప 
ఏ కానుకలను అందించగలనో.. చెలీ 
గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప 

జగతిపై నడయాడు చంచలా వల్లికా 
తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా... 
శరదిందు చంద్రికా... 

నీవు లేని తొలి రాతిరి.. 
నిట్టూర్పుల పెను చీకటి 
నీవు లేని విరి పానుపు.. 
నిప్పులు చెరిగే కుంపటి 

విరులెందుకు.. సిరులెందుకు 
మనసు లేక.. మరులెందుకు 
తలపెందుకు.. తనువెందుకు 
నీవు లేక.. నేనెందుకు.. 
నీవు లేక.. నేనెందుకు..

కలువపూల చెంత చేరి
కైమోడుపు సేతునూ
నా కలికి మిన్న కన్నులలో
కలకలమని విరియాలనీ

మబ్బులతో ఒక్క మారు
మనవి చేసికొందును 
నా అంగన ఫాలాంగణమున 
ముగురులై కదలాలనీ

చుక్కలతో ఒక్కసారి సూచింతును
నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల 
మల్లియలై మొలవాలనీ 

పూర్ణ సుధాకర బింబమ్మునకు 
వినతి సేతును నా పొలతికి 
ముఖ బింబమై 
కళలు దిద్దుకోవాలనీ

ప్రకృతి ముందు 
చేతులెత్తి ప్రార్ధింతును 
కడసారిగా నా రమణికీ 
బదులుగా ఆకారం 
ధరియించాలనీ.. 


 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.