శ్రీ కృష్ణలీలలు సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శ్రీ కృష్ణలీలలు (1958)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం : ఆరుద్ర
గానం : మాధవపెద్ది సత్యం, స్వర్ణలత
గోపాలకృష్ణమ్మ దక్కాడురా
ఘోర కాళీయుడే చిక్కాడురా
గోపాలకృష్ణమ్మ దక్కాడురా
ఘోర కాళీయుడే చిక్కాడురా
చాటుమాటున దాగి సజ్జనుల బాధించు
చాటుమాటున దాగి సజ్జనుల బాధించు
సర్పాల దర్పాలు అణిగాయిరా
అణిగాయిరా
గోపాలకృష్ణమ్మ దక్కాడురా
ఘోర కాళీయుడే నేడు చిక్కాడురా
పడగపై అడుగేసి బాలకృష్ణుడు ఆడ
ఘల్లు ఘల్లన్నాయి తన అందెలు
ఘల్లు ఘల్లన్నాయి తన అందెలు
గోపాలకృష్ణమ్మ దక్కాడురా
ఘోర కాళీయుడే చిక్కాడురా
చిన్ని కృష్ణుని చిందు చూడగా చూడాగా
చిన్ని కృష్ణుని చిందు చూడగా చూడగా
ఝుల్లు ఝుల్లన్నాయి మన గుండెలు
తాండవ కృష్ణుడు కాళియాహి పై
తకథిమి, తకధిమి నాట్యముచేసే
తాండవ కృష్ణుడు కాళియాహి పై
తకధిమి తకధిమి నాట్యం చేసే
గోపాలకృష్ణమ్మ దక్కాడురా
ఘోర కాళీయుడే చిక్కాడురా
గోపాలకృష్ణమ్మ దక్కాడురా
ఘోర కాళీయుడే చిక్కాడురా
తలపైన కృష్ణమ్మ తాండవము చేయగా
కాళీయుడైనాడు ఖండాలు
ఖండాలు
తప్పాయి మనకింక గండాలు
గండాలు
చెప్పరా
చెప్పరా దేవుడికి దండాలు
తాండవ కృష్ణుడు కాళియాహిపై
తకధిమి తకధిమి నాట్యము చేసే
తాండవ కృష్ణుడు కాళియాహిపై
తకధిమి తకధిమి నాట్యము చేసే
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.