అన్వేషణ చిత్రం లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అన్వేషణ (1985)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : జానకి
పపగ పపగ పపగ పపగ...
పపగ పస... పపగ పస...
ఎదలో లయ ఎగసే లయ
ససమా నినిరీ
ససమా నినిరీ
గగగ మమమ
ససస ససస ససస
ఎదలో లయ ఎగసే లయ
ఎగసి ఎగిరి ఎదలో ఒదిగి
శుకమా స్వరమా పికమా
పదమా సుఖమా
గాగా ఆ... ఆ...
దివ్యమే నీ దర్శనం
శ్రావ్యమేలే స్పందనం
శోధనే నా జీవనం సాధనేలే జీవితం
వెతలే శ్రుతులై కలిసే ఆలాపన
వెతికి వెతికి బ్రతుకే అన్వేషణ
నాలో నేడే విరులవాన
ఎదలో లయ ఎగసే లయ
ఎగసి ఎగిరి ఎదలో ఒదిగి
శుకమా స్వరమా పికమా
పదమా సుఖమా
కోకిలగీతం తుమ్మెదనాదం
కోకిలగీతం తుమ్మెదనాదం
జలజల పారే సెలగానం
ఘుమఘుమలాడే సుమరాగం
అరెరె... ఆ... ఆ... ఆ...
కొండ కోన... ఎండ వాన...
ఏకమైన ప్రేమగీతం...
ఔనా... మైనా... నీవే... నేనా...
శుకపికముల కలరవముల
స్వర లహరులలో
సససస.... దదదద...పపపప...
రిరిరిరి....నినినిని... సససస
రిరిరిరి....నినినిని... సససస
కలికి చిలుక పలికేదేమో
ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ
విరుల తెరలో జరిగేదేమో
మరులే పొంగి పొరలిన వేళ
కలికి చిలుక పలికేదేమో
ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ
సససస... సససస...
విహంగమా... సంగీతమా...
విహంగమా... సంగీతమా...
సంగీతమే విహంగమై చరించగా
స్వరాలతో వనాంతమే జ్వలించగా
ఎన్నాళ్లు సాగాలి ఏకాంత అన్వేషణ
అలికిడి ఎరుగని తొలకరి వెలుగులలో
కలికి చిలుక పలికేదేమో
ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ
విరుల తెరలో జరిగేదేమో
మరులే పొంగి పొరలిన వేళ
సససస.... దదదద...పపపప...
సససస.... దదదద...పపపప...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.