శనివారం, డిసెంబర్ 12, 2020

ప్రాణంలో ప్రాణంగా...

ఆంధ్రుడు చిత్రం లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఆంధ్రుడు (2005) 
సంగీతం : కళ్యాణ్ కోడూరి   
సాహిత్యం : చంద్రబోస్ 
గానం : చిత్ర 

ప్రాణంలో ప్రాణంగా 
మాటల్లో మౌనంగా చెబుతున్నా
బాధైన ఏదైనా 
భారంగా దూరంగా వెళుతున్నా
మొన్న కన్నకల నిన్న విన్నకథ
రేపు రాదు కదా జతా
ఇలా ఎలా నిరాశగా 
దరి దాటుతున్నా 
ఊరు మారుతున్నా
ఊరుకోదు ఎలా

ప్రాణంలో ప్రాణంగా 
మాటల్లో మౌనంగా చెబుతున్నా
బాధైన ఏదైనా 
భారంగా దూరంగా వెళుతున్నా
మొన్న కన్నకల నిన్న విన్నకథ
రేపు రాదు కదా జతా
ఇలా ఎలా నిరాశగా 
దరి దాటుతున్నా 
ఊరు మారుతున్నా
ఊరుకోదు ఎలా

ప్రాణంలో ప్రాణంగా 
మాటల్లో మౌనంగా చెబుతున్నా

స్నేహం నాదే ప్రేమ నాదే 
ఆ పైన ద్రోహం నాదే
కన్ను నాదే వేలు నాదే 
కన్నీరు నాదేలే
తప్పంతా నాదే శిక్షంతా నాకే 
తప్పించుకోలేనే
ఎడారిలో తుఫానునై 
తడి ఆరుతున్నా 
తుది చూడకున్నా
ఎదురీదుతున్నా

ప్రాణంలో ప్రాణంగా 
మాటల్లో మౌనంగా చెబుతున్నా
బాధైన ఏదైనా 
భారంగా దూరంగా వెళుతున్నా

ఆట నాదే గెలుపు నాదే 
అనుకోని ఓటమి నాదే
మాట నాదే బదులూ నాదే 
ప్రశ్నల్లే మిగిలానే
నా జాతకాన్నే నా చేతితోనే 
ఏమార్చి రాశానే
గతానిపై సమాధినై 
గతి మారుతున్నా 
స్ధితి మారుతున్నా 
బ్రతికేస్తు ఉన్నా...

ప్రాణంలో ప్రాణంగా 
మాటల్లో మౌనంగా చెబుతున్నా

గతానిపై సమాధినై 
గతి మారుతున్నా 
స్ధితి మారుతున్నా 
బ్రతికేస్తు ఉన్నా
 


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.