ఆదివారం, డిసెంబర్ 27, 2020

పిల్లనగ్రోవి పిలుపు...

శ్రీకృష్ణ విజయం సినిమాలోని ఒక కమ్మని కన్నయ్య పాటను ఈరోజు తలచుకొందామా. పెండ్యాల గారి స్వరసారధ్యంలో హాయిగా సాగే ఈ పాటంటే నాకు చాలా ఇష్టం, మీరూ వినండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీ కృష్ణ విజయం (1970)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల

పిల్లనగ్రోవి పిలుపు... 
మెలమెల్లన రేపెను వలపు
మమతను దాచిన మనసు.. 
ఒక మాధవునికే తెలుసు..
ఈ మాధవునికే తెలుసు

 
సుందరి అందెల పిలుపు
నా డెందమునందొక మెరుపు
నందకిశోరుని మనసు.. 
రతనాల బొమ్మకు తెలుసు...
ఈ రతనాల బొమ్మకు తెలుసు...

ఆ..ఆ..ఆ..ఆ...అహ..ఆ..అహ..ఆ..ఆ..ఆ
అహ..అహా...ఆ...అహ..అహా..ఆ...

వెన్న మీగడలు తిన్నావట..
వెన్నెలలో ఆడుకున్నావటా..
వెన్న మీగడలు తిన్నావట...
వెన్నెలలో ఆడుకున్నావటా...
ఎన్నో నేర్చిన వన్నెకాడవట...
ఏమందువో మరి నా మాట
ఏమందువో మరి నా మాట...

వెన్న మీగడలు తిన్నది నిజము...
ఎన్నో నేర్చితినన్నది నిజము
వెన్న మీగడలు తిన్నది నిజము...
ఎన్నో నేర్చితినన్నది నిజము
చిన్నారీ...ఈ.....చిన్నారీ! 
నీ కన్నుల బాసలు.. 
వెన్నుని దోచిన ఆ మాట నిజము..
వెన్నుని దోచిన మాట నిజము!

సుందరి అందెల పిలుపు..
నా డెందము నందొక మెరుపు
ఓ..పిల్లనగ్రోవి పిలుపు...
మెలమెల్లన రేపెను వలపు!
 
అహ..ఆ..ఆహా..ఆ..అహా..ఆ..
అందీ అందని అందగాడవని...
ఎందరో అనగా విన్నాను
అందీ అందని అందగాడవని...
ఎందరో అనగా విన్నాను
అందులోని పరమార్ధమేమిటో...
అలవోకగా కనుగొన్నాను..
అలవోకగా కనుగొన్నాను... 
ఆఆ..అహ..ఆ..ఆహా..ఆ..
ఎంత బేలవని అనుకున్నాను...
అంత గడసరి తరుణివిలే
ఎంత బేలవని అనుకున్నాను...
అంత గడసరి తరుణివిలే
అష్ట భార్యలతో అలరే రాజును...
చెంగును ముడిచిన చెలువవులే...
చెలువవులే చెంగలువవులే...

పిల్లనగ్రోవి పిలుపు.. 
మెలమెల్లన రేపెను వలపు
మమతను దాచిన మనసు.. 
ఒక మాధవునికే తెలుసు
ఈ మాధవునికే తెలుసు
 
ఆ..ఆ..ఆ..ఆ...అహ..ఆ..అహ..ఆ..ఆ..ఆ
అహ..ఆ...ఆ...అహ..ఆ..అహ...




0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.