మేమూ మనుషులమే చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మేమూ మనుషులమే (1973)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల
ఏమంటున్నది ఈ గాలీ?
ఎగిరే పైటను అడగాలీ..
ఏమంటున్నది ఈ గాలీ?
ఎగిరే పైటను అడగాలీ..
ఎగిరే పైటను ఏం చెయ్యాలి?
ఇంకో కొంగును ముడివెయ్యాలి
అహ..అహ..హ..
ఎగిరే పైటను ఏం చెయ్యాలి?
ఇంకో కొంగును ముడివెయ్యాలి
ఏమంటున్నది ఈ గాలీ?
ఎగిరే పైటను అడగాలీ
పైటకు తెలుసు చాటున
పొంగే ప్రాయం రెపరెపలూ...
గాలికి తెలుసూ విరిసీ విరియని
పూవుల ఘుమఘుమలూ..
ఊగే నడుమూ.. సాగే జడతో..
వేసెను పంతాలూ..ఊ..
నీలో వుడుకూ.. నాలో దుడుకూ..
చేసెను నేస్తాలూ.. చేసెను నేస్తాలూ..
ఏమంటున్నది ఈ గాలీ...
ఎగిరే పైటను అడగాలీ...
మబ్బు మబ్బుతో ఏకమైనది..
సాయం సమయంలో...ఓ..
మనసు మనసుతో లీనమైనది..
మమతల మైకంలో...ఓ..
అల్లరి కళ్లూ.. వెన్నెల నవ్వూ..
పెట్టెను గిలిగింతా..
వెచ్చని వొడిలో.. ఇచ్చిన చోటున..
ఇమిడెను జగమంతా..
ఇమిడెను జగమంతా..
ఏమంటున్నది ఈ గాలీ...
ఎగిరే పైటను అడగాలీ...
అహ..హ..అహా...లల..ల.లా.లా..
అహ..హ..అహా...లల..ల.లా.లా..
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.