గురువారం, డిసెంబర్ 10, 2020

కాటుక కనులే...

ఆకాశం నీ హద్దురా సినిమా లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఆకాశం నీ హద్దురా (2020) 
సంగీతం : జి.వి.ప్రాకాష్ కుమార్  
సాహిత్యం : భాస్కరభట్ల  
గానం : ధీ

లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ
లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ

లల్లాయి లాయిరే లాయిరే… లాయ్
లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ

కాటుక కనులే మెరిసిపోయే 
పిలడా నిను చూసీ
మాటలు అన్ని మరిసిపోయా 
నీళ్ళే నమిలేసీ…

ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు
గుండెకెంత సందడొచ్చేరా
వేప చెట్టు ఆకులన్ని గుమ్మరించినట్టు
ఈడుకేమో జాతరొచ్చేరా…

నా కొంగు చివర దాచుకున్న 
చిల్లరే నువ్వురా
రాతిరంత నిదురపోని 
అల్లరే నీదిరా..!
మొడుబారి పోయి ఉన్న 
అడవిలాంటి ఆశకేమో
ఒక్కసారి చిగురులొచ్చేరా

నా మనసే నీ వెనకే తిరిగినదీ
నీ మనసే నాకిమ్మని అడిగినదీ

లల్లాయి లాయిరే లాయిరే లాయ్
లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ

లల్లాయి లాయిరే లాయిరే లాయ్
లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ

గోపురాన వాలి ఉన్న పావురాయిలా
ఎంత ఎదురు చూసినానో అన్ని దిక్కులా
నువ్వు వచ్చినట్టు ఏదో అలికిడవ్వగా
చిట్టి గుండె గంతులేసే చెవుల పిల్లిలా

నా మనసు విప్పి చెప్పనా… 
సిగ్గు విడిచి చెప్పనా
నువ్వు తప్ప ఎవ్వరొద్దులేరా
నే ఉగ్గబట్టి ఉంచినా… 
అగ్గి అగ్గి మంటనీ
బుగ్గ గిల్లి బుజ్జగించుకోరా

నీ సూదిలాంటి చూపుతో 
దారమంటి నవ్వుతో
నిన్ను నన్ను ఒకటిగా 
కలిపి కుట్టరా
నా నుదిటి మీద వెచ్చగా 
ముద్దు బొట్టు పెట్టారా

కుట్టి కుట్టి పోరా ఆ ఆ 
కందిరీగ లాగా…
చుట్టు చుట్టుకోరా ఆ ఆ 
కొండచిలువ లాగా…

కత్తి దుయ్యకుండ సోకు తెంచినావురా
గోరు తగలకుండ నడుము గిచ్చినావురా
అయ్యబాబోయ్ అస్సలేమి ఎరగనట్టుగా
రెచ్చగొట్టి తప్పుకుంటావెంత తెలివిగా

నీ పక్కనుంటే చాలురా పులస చేప పులుసులా
వయసు ఉడికిపోద్ది తస్సదియ్యా…
నే వేడి వేడి విస్తరై తీర్చుతాను ఆకలి
మూడు పూట్ల ఆరగించరయ్య
నా చేతి వేళ్ళ మెటికలు విరుచుకోర మెల్లగా
చీరకున్న మడతలే చక్కబెట్టారా

నీ పిచ్చి పట్టుకుందిరా
వదిలిపెట్టనందిరా
నిన్ను గుచ్చుకుంటా
ఆ ఆ, నల్లపూసలాగా
అంటిపెట్టుకుంటా ఆ ఆ, 
వెన్నుపూసలాగా..

లల్లాయి లాయిరే లాయిరే లాయ్
లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ 


  

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.