బుధవారం, డిసెంబర్ 02, 2020

మిడిల్ క్లాస్ మెలోడీస్ - అన్ని పాటలు

మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంలోని అన్ని పాటల సాహిత్యాన్ని ఈ రోజు తలచుకుందాం. ఇవి అద్భుతమైన పాటలని చెప్పలేను కానీ సినిమాతో సంధర్భానుసారంగా చక్కగా కలిసిపోయిన కమ్మని పాటలు. వింటున్న కొద్దీ సినిమాలో సన్నివేశాలు గుర్తు చేస్తూ ఇంకా ఇంకా నచ్చేసే పాటలు. ఈ పాటలు ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ జ్యూక్ బాక్స్ వీడియో ఇక్కడ చూడవచ్చు. పాటల వీడియో విడుదలైన తర్వాత ఈ పోస్ట్ మరోసారి అప్డేట్ చేస్తాను. 


చిత్రం : మిడిల్ క్లాస్ మెలోడీస్ (2020)
సంగీతం : స్వీకార్ అగస్తి
సాహిత్యం : కిట్టు విస్సా ప్రగడ 
గానం : అనురాగ్ కులకర్ణి 

తెల్లారే ఊరంతా తయ్యారే 
ముస్తాబై పిలిచింది గుంటూరే
రద్దీలో యుద్ధాలే మొదలాయే 
తగ్గేదే లేదంటే ప్రతివాడే
మరుపే రాని ఊరే గుంటూరే 
అలుపంటూ లేదంటే సూరీడే
పగలంతా తడిసేలే సొక్కాలే 
ఎన్నెన్నో సరదాలే కొలువుంటే
కారాలే నూరేది అంటారే..

బేరం సారం సాగే దారుల్లోన 
నోరూరించే మిర్చీబజ్జీ తగిలే
దారం నుంచీ సారె సీరల దాక 
గాలం ఏసి పట్నంబజారు పిలిసే

యే… పులిహోర దోశ – బ్రాడీపేట
బిర్యానికైతే – సుభాని మామ
వంకాయ బజ్జీ – ఆరో లైను
గోంగూర సికెనూ – బృందావనమూ
మసాల ముంత – సంగడిగుంట
మాలు పూరి – కొత్తపేట
చిట్టి ఇడ్లీ – లక్ష్మి పురమూ
అరె… చెక్క పకోడీ – మూడొంతెనలూ
గుటకే పడక కడుపే తిడితే 
సబ్జా గింజల సోడా బుస్సందే

పొడి కారం నెయ్యేసి పెడుతుంటే 
పొగ చూరే దారుల్లో నోరూరే
అడిగిందే తడువంటా ఏదైనా 
లేదన్నా మాటంటూ రాదంటా
సరదా పడితే పోదాం గుంటూరే

~*~*~*~*~*~*~*~*~*~
 
చిత్రం : మిడిల్ క్లాస్ మెలోడీస్‌ (2020)
సంగీతం : స్వీక‌ర్ అగ‌స్తి
సాహిత్యం : సనపతి భరద్వాజ్ పాత్రుడు
గానం : స్వీక‌ర్ అగ‌స్తి

సంధ్యా..! పదపద పదమని 
అంటే సిగ్గే ఆపిందా
బావా..! అని పిలిచేందుకు 
మోమాటంతో ఇబ్బందా

నువు వణక్క, తొణక్క, బెరక్క 
సరిగ్గ ఉంటే చాలే
కథ వెనక్కి జరక్క చురుగ్గ 
కొలిక్కి త్వరగా వస్తాదే
ఇది వయస్సు విపత్తు 
ఒకింత తెగించి ఉంటే మేలే
విధి తరించి తలొంచి 
కరెక్టు ముగింపు ఇపుడే ఇస్తాదే

మధ్యలో ఉన్నదీ దగ్గరో దూరమో 
కాస్తయినా తెలిసిందా
ఎంతకీ తేలనీ ప్రేమలో తేలడం 
ఏమైనా బాగుందా ఆఆ
మాటలని కుక్కేశావే మనసు నిండా
వాటినిక పంపేదుందా పెదవి గుండా
బిడియంతో సహవాసం ఇక చాలు బాలిక
అది ఎంతో అపచారం అని అనుకోవే సిలకా

సంధ్యా..! పదపద పదమని 
అంటే సిగ్గే ఆపిందా
బావా..! అని పిలిచేందుకు 
మోమాటంతో ఇబ్బందా

ఏం సరిపోద్దే నువు చూపే ప్రేమా
ఓ తెగ చూస్తే పనులేవీ కావమ్మా
పైకలా అవుపిస్తాడే ఎవరికైనా
వాడికీ ఇష్టం ఉందే తమరిపైనా
విసిరావో గురిచూసి వలపన్న బాణమే
పడిపోదా వలలోన పిలగాడి ప్రాణమే

సంధ్యా..! పదపద పదమని 
అంటే సిగ్గే ఆపిందా
ఔనే..! పొగరుని ప్రేమతో 
మనిషిని చేస్తే మీ బావే
నువు వణక్క, తొణక్క, బెరక్క 
సరిగ్గ ఉంటే చాలే
కథ వెనక్కి జరక్క చురుగ్గ 
కొలిక్కి త్వరగా వస్తాదే
ఇది వయస్సు విపత్తు 
ఒకింత తెగించి ఉంటే మేలే
విధి తరించి తలొంచి 
కరెక్టు ముగింపు ఇపుడే ఇస్తాదే

~*~*~*~*~*~*~*~*~*~
 
చిత్రం : మిడిల్ క్లాస్ మెలోడీస్ (2020)
సంగీతం : స్వీకార్ అగస్తి
సాహిత్యం : సనపతి భరద్వాజ్ పాత్రుడు
గానం : అనురాగ్ కులకర్ణి, స్వీకార్ అగస్తి
రమ్య బెహరా 
 
కీలుగుర్రమెక్కాడే కిందా మీదా పడ్డాడే
రాకుమారి కావాలన్నాడే
ఊబిలోకి దూకాడే ఊత గట్రా లేనోడే
ఊరినల్లా ఏలాలన్నాడే
గాలిగాడు తీరే మారి దారిలోకి వచ్చాడే
యావ మీద యాపారాన్నే పెట్టాడే
ఆరు నూరు అయ్యేదాకా అవలించానన్నాడే
ఆగలేక సాగేలాగే ఉన్నాడే
హే స్వారి చెయ్ రా కాలం మీద

సీకుసింతలున్నోడే సున్నా కన్నా సిన్నోడే
సిన్న సూపు సూడద్దన్నాడే
జీవితాన్ని పిల్లోడే పట్టాలెక్కించేసాడే
మైలు రాయి దాటించేసాడే

నోటి నీరు ఊరే ఊరే వంట ఈడు సేత్తాడే
తిన్నవాడు ఆహాలోకంసూత్తడే
నోటు మీద గాంధీ తాతే
నవ్వుకుంటూ వచ్చాడే
నవ్వుకుంట గల్లాపెట్టి సెరాడే
హే అడ్డే నీకు లేదియ్యల

నీకై వీచే పిల్ల గాలి ఈవేళ 
శ్వాసల్లే చేరిందా ఎదలో
నిన్నా మొన్నా ఉన్న బాధ ఈవేళ
హాయల్లే మారిందా మదిలో
సడి లేని జడివాన 
సరదాగా కురిసిందా
మనసారా తడిలోన
పొడి ప్రాణం తడిసిందా
గుండెల్లో ఉండే ప్రేమ
కళ్ళల్లో చేరిందమ్మా
చూపుల్లో ఉండే ప్రేమ దాగేనా
దాచాలన్న కుదరదు సుమా

అసలొకమాటైనా ఎవరితో అనకుండా
అలిగెళ్ళిపోయింది దూరమెందుకో
అంతులేని సంతోషం గంతులేసే
ఈ నిమిషం ఇద్దరొక్కటయ్యేరోయ్ 
ఇపుడే ఇపుడే
ఏ బాధ బంది లేదియ్యాలా

ఉంది నేడు బాగానే నిన్నా మొన్నా లాగానే
రేపు కూడా ఉంటాదంటావా
గడ్డు రోజులొస్తేనే కష్టం చుట్టం అయితేనే
మార్పు నీలో వస్తాదంటావా
ఈతి బాధలొచ్చాయంటూ 
బోరు బోరుమంటావా
వద్దు వద్దు అంటే నువ్వే ఇంటావా
ఓడ లేని రేవే నీవై బోసి పోయి ఉంటావా
ఓడిపోని వారే లేరోయ్ చూస్తావా
ఏ సాయం చేసే కాలం రాదా

~*~*~*~*~*~*~*~*~*~

చిత్రం : మిడిల్ క్లాస్ మెలోడీస్ (2020)
సంగీతం : స్వీకార్ అగస్తి
సాహిత్యం : శివతత్వం
గానం : రామ్ మిరియాల, కోరస్   

సాంబశివా నీదు మహిమ 
ఎన్నటికీ.. తెలియదాయె
సాంబశివా నీదు మహిమ 
ఎన్నటికీ.. తెలియదాయె 
సాంబశివా నీదు మహిమ 
ఎన్నటికీ.. తెలియదాయె
సాంబశివా నీదు మహిమ 
ఎన్నటికీ.. తెలియదాయె
హర హరా.. శివ శివా
హర హరా.. శివ శివా

ఆ.. గంగా జలము తెచ్చి 
నీకు అభిషేకము సేతునంటె
గంగా జలము తెచ్చి 
నీకు అభిషేకము సేతునంటె
మరి గంగ జలమున సేపకప్పల 
ఎంగిలంటున్నావు శంభో
హర హరా.. ఆహ..శివ శివా
హర హరా..శివ శివా

ఆ..సాంబశివా నీదు మహిమ 
ఎన్నటికీ.. తెలియదాయె
హర హరా.. శివ శివా

ఆ.. ఆవుపాలు తెచ్చి 
నీకు అర్పితము సేతునంటే
ఆవుపాలు తెచ్చి 
నీకు అర్పితము సేతునంటే
ఆవుపాలనల లేగదూడల 
ఎంగిలంటున్నావు శంభో
హర హరా.. ఓహో.. శివ శివా
గట్టిగా.. హర హరా.. శివ శివా.. అద్దీ

సాంబశివా నీదు మహిమ 
ఎన్నటికీ.. తెలియదాయె
సాంబశివా నీదు మహిమ 
ఎన్నటికీ.. తెలియదాయె

అహా.. ఓహో.. ఓహో
తుమ్మి పూలు తెచ్చి 
నీకు తుష్టుగ పూజింతునంటే
తుమ్మి పూలు తెచ్చి 
నీకు తుష్టుగ పూజింతునంటే
కొమ్మా కొమ్మన కోటి 
తుమ్మెదలెంగిలంటున్నావు శివా
హర హరా.. శివ శివా.. అర్రె
హర హరా.. శివ శివా

సాంబశివా నీదు మహిమ 
ఎన్నటికీ.. తెలియదాయె
హర హరా.. గట్టిగా.. శివ శివా

నారికేళము తెచ్చి 
నీకు నైవేధ్యము సేతునంటే
నారికేళము తెచ్చి 
నీకు నైవేధ్యము సేతునంటే
అప్పుడు బహుఇష్టము అంటివి శంభో.. 
సామి..  హర హరా.. శివ శివా.. ఆహ
హర హరా.. ఓహో.. శివ శివా
హర హరా.. శివ శివా
హర హరా.. శివ శివా
 
~*~*~*~*~*~*~*~*~*~ 
 
చిత్రం : మిడిల్ క్లాస్ మెలోడీస్ (2020)
సంగీతం : స్వీకార్ అగస్తి
సాహిత్యం : సానపతి భరధ్వాజ పాత్రుడు
గానం : విజయ్ ఏసుదాస్ 

మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో 
అంతుచిక్కలేదా కాలమెటువంటిదో
కయ్యామో నెయ్యమో ఎప్పుడేం చెయ్యునో
లెక్కతేలలేదా దాని తీరు ఏమిటో
ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం
వేచి ఉంటె రాదారి చూపించదా
చిక్కు ప్రశ్నలేసేటి తెలివైన కాలం 
తప్పకుండ బదులై రాదా

మదిలోని చిరునవ్వు జన్మించగా
కలతే పోదా కనుమూయదా
నడిరేయి దరిచేరి మసి పూయగా
వెలుగేరాదా చెరిపేయదా
అరచేతి రేఖల్లో లేదంట రేపు
నిన్నల్ని వదిలేసి రావాలి చూపు
చూడొద్దు ఏదంటు ఓదారుపు..
వచ్చిపోయే మేఘాలే ఈ బాధలన్నీ
ఉండిపోవు కడదాకా ఆ నింగిలా
అంతమైతే కారాదు లోలోని దైర్యం
అంతులేని వ్యధలే ఉన్నా

సంద్రాన్ని పోలింది ఈ జీవితం
తెలిసే తీరాలి ఎదురీదడం
పొరపాటు కాదంట పడిపోవడం
ఉండాలోయ్ లేచే గుణం
ఎటువంటి ఆటంకమెదురైనా గాని
మునుముందు కెళ్ళేటి అలవాటు మాని
కెరటాలు ఆగేటి రోజేదనీ
గంతలన్నీ ఓనాడూ తీసేసి కాలం
వాస్తవాన్ని కళ్లారా చుపించదా
కమ్ముకున్న భ్రమలన్ని కావాలి మాయం
కిందపడ్డ తరువాతైనా

తన్నేనా తన్నేనా తన్నేనా తన్నేనా
తానే నానె నానా తానే నానె నానేనా
తన్నేనా తన్నేనా తన్నేనా తన్నేనా
తన్నే నానె నానా తన్నే నానె నానేనా

~*~*~*~*~*~*~*~*~*~
 
చిత్రం : మిడిల్ క్లాస్ మెలోడీస్ (2020)
సంగీతం : స్వీకార్ అగస్తి
సాహిత్యం : సాయి కిరణ
గానం : స్వీకార్ అగస్తి

వెచ్చని మట్టిలో నాటిన విత్తనం
ఊపిరందుకోదా చుక్క నీరు పట్టినా
రాతిరే కప్పిన దారులే తప్పినా
తెల్లవారనందా చీకటెంత కమ్మినా

తూరుపింట మొదలైన కిరణాల వేడి
లోకమంతా అందాలు అందించదా
దారిలోన ఎదురైనా గ్రహణాలు వీడి
రంగులద్దుకుంటూ రాదా

చిగురాకు పిలిచింది రారమ్మనీ
నీలాకాశాన మేఘాలనీ
అటు నుండి బదులేది రాలేదని
అలిగిందా ఆ ఆమని
జరిగింది గమనించి ఆ చల్లగాలి
జోలాలి పాడింది తన చెంత చేరి
చినబోయినా చిన్న ప్రాణానికీ

వేకువింట మొదలైన కిరణాల వేడి
లోకమంతా అందాలు అందించదా
దారిలోన ఎదురైనా గ్రహణాలు వీడి
రంగులద్దుకుంటూ రాదా
 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.