మంగళవారం, డిసెంబర్ 15, 2020

బలేగుంది బాలా!

దారి చూడు దుమ్ము చూడు మామా పాటతో దుమ్ము లేపేసిన పెంచల్ దాస్ గుర్తున్నారు కదా. ఆయన శ్రీకారం సినిమా కోసం అందించిన మరో అదరగొట్టే జానపదాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీకారం (2020)
సంగీతం : మిక్కీజెమేయర్
సాహిత్యం : పెంచల్ దాస్
గానం : పెంచల్ దాస్, నూతన మోహన్  

వచ్చానంటివో పోతానంటివో 
వగలు పలుకుతావే
కట్టమింద పొయ్యే అలకల చిలకా 
బలేగుంది బాలా
దాని ఎదాన ఉండే పూల పూల రైకా 
బలేగుంది బాలా!

వచ్చానంటివో పోతానంటివో 
వగలు పలుకుతావే
వచ్చానంటివో పోతానంటివో 
వగలు పలుకుతావే
కట్టమింద.. కట్టమింద.. 
కట్టమింద పొయ్యే అలకల చిలకా 
బలేగుంది బాలా
దాని ఎదాన.. దాని ఎదాన.. 
దాని ఎదాన ఉండే పూల పూల రైకా 
బలేగుంది బాలా!

అరెరెరెరె.. 
నారి నారి వయ్యారి సుందరీ 
నవ్వు మొకముదానా
నారి నారి వయ్యారి సుందరీ... 
నవ్వు మొకముదానా
నీ నవ్వూ మొకం.. నీ నవ్వూ మొకం..
నీ నవ్వూ మొకం మింద నంగనాచి అలకా 
బలేగుంది బాలా!
నీ నవ్వూ మొకం మింద నంగనాచి అలకా 
బలేగుంది బాలా!

వచ్చానంటివో పోతానంటివో 
వగలు పలుకుతావే
కట్టమింద పొయ్యే అలకల చిలకా 
బలేగుంది బాలా
దాని ఎదాన ఉండే పూల పూల రైకా 
బలేగుంది బాలా!

హో...ఓఓ...హో...ఓఓ..
అరెరెరె అరెరెరె అరె అరె అరే.. 
తిక్కరేగి ఎక్కినావు కోమలీ 
అలకనులక మంచం
తిక్కారేగి ఎక్కినావు కోమలీ 
అలక నులక మంచం
అలసందా పూవ నీకు అలక ఏలనే 
అగుడు సేయ తగునా..!

వచ్చానంటివో.. అరె.. వచ్చానంటివో.. 
వచ్చానంటివో పోతానంటివో 
వగలు పలుకుతావే
కట్టమింద పొయ్యే అలకల చిలకా 
బలేగుంది బాలా
దాని ఎదాన ఉండే పూల పూల రైకా 
బలేగుంది బాలా!

అరెరెరెరెరె..
సురుకు సూపు సురకత్తులిసరకే 
చింత ఏల బాలా
సురుకు సూపు సురకత్తులిసరకే 
చింత ఏల బాలా
ముదిగారమైన.. ముదిగారమైన.. 
ముదిగారమైన నీ మూతి ఇరుపులూ 
బలేగున్నయి బాలా
నీ అలక తీరను ఏమి భరణము 
ఇవ్వగలను భామా!

ఎన్నెలైన ఏమంత నచ్చదూ.. 
ఎన్నెలైన ఏమంత నచ్చదు 
నువ్వు లేని చోటా
ఎన్నెలైన ఏమంత నచ్చదు 
నువ్వు లేని చోటా
నువు పక్కనుంటే.. నువ్వు పక్కనుంటే.. 
నువ్వు దాపూనుంటే ఇంకేమి వద్దులే 
చెంత చేరరావా!
ఇంకనైన పట్టించుకుంటనని 
మాట ఇవ్వు మావా
తుర్రు మంట పైకెగిరిపోద్ది 
నా అలక సిటికెలోనా!
 

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.