బుధవారం, డిసెంబర్ 09, 2020

జాను - అన్ని పాటలు - All Lyrics

మధురమైన ప్రేమ కథ జాను సినిమాలోని అన్ని పాటలను వాటి సాహిత్యాన్నీ ఈ రోజు తలచుకుందాం. ఈ పాటల ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. అనంతం పాట ఆడియో ఇక్కడ వినవచ్చు. మొదటి పాట లైఫ్ ఆఫ్ రామ్ ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : జాను (2020) 
సంగీతం : గోవింద్ వసంత  
సాహిత్యం : సిరివెన్నెల    
గానం : ప్రదీప్ కుమార్  

ఏ దారెదురైనా ఎటువెళుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా
ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా

కదలని ఓ శిలనే అయినా 
త్రృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ 
అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్నా
ఏదో ఒక బదులై నను చెరపొద్దని 
కాలాన్నడుగుతు ఉన్నా

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనొద్దు 
అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మాలకి సరిపడు 
అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు

నా ఊపిరిని ఇన్నాళ్ళుగా 
తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా ఎద లయలు కుశలము అడిగిన
గుస గుస కబురుల ఘుమ ఘుమ లెవరివీ

ఉదయం కాగానే 
తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనదా
అనగనగా అంటూ నే ఉంటా 
ఎపుడూ పూర్తవనే అవకా
తుది లేని కథ నేనుగా

గాలి వాటం లాగా 
ఆగే అలవాటే లేక
కాలు నిలవదు యే చోటా
నిలకడగ
యే చిరునామా లేక
యే బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక
మౌనంగా

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనొద్దు 
అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మాలకి సరిపడు 
అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు

నా ఊపిరిని ఇన్నాళ్ళుగా 
తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా ఎద లయలు కుశలము అడిగిన
గుస గుస కబురుల ఘుమ ఘుమ లెవరివీ

లోలో ఏకాంతం 
నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్నా విన్నారా
నేనూ నా నీడా ఇద్దరమే చాలంటున్నా 
రాకూడదు ఇంకెవరైనా..

అమ్మ ఒడిలో మొన్న 
అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది
జాబిల్లి అంత దూరానున్నా 
వెన్నెలగా చెంతనే ఉన్నా
అంటూ ఊయలలూపింది జోలాలి

తానే... నానే... నానినే...
తానే... నానే... నానినే...
తానే... నానే... నానినే...
తానే... నానే... నానినే...
తానే... నానే... నానినే...
తానే... నానే... నానినే...

~*~*~*~*~*~*~*~*~

ప్రాణం నా ప్రాణం పాట ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  

 
చిత్రం : జాను (2020) 
సంగీతం : గోవింద్ వసంత  
సాహిత్యం : శ్రీమణి     
గానం : గౌతం భరద్వాజ్, చిన్మయి    

ప్రాణం నా ప్రాణం నీతో ఇలా..  
గానం తొలి గానం పాడే వేళా..

తారా తీరం
మన దారిలో కాంతులే కురిసేలా
చాలా దూరం 
రాబోవు ఉదయాలనే విసిరేలా

ప్రాణం నా ప్రాణం నీతో ఇలా..
గానం తొలి గానం పాడే వేళ

మన బాల్యమే ఒక పౌర్ణమి
ఒకే కథై అలా..
మన దూరమే అమావాస్యలే
చెరో కథై ఇలా..
మళ్ళీ మళ్ళీ జాబిలివేళ
వెన్నెల జల్లిందిలా నీ జంటగా
మారేలోపే ఈ నిమిషం కలలా
దాచేయాలీ గుండెలో గురుతులా

తారా తీరం
మన దారిలో కాంతులే కురిసేలా
చాలా దూరం 
రాబోవు ఉదయాలనే విసిరేలా

~*~*~*~*~*~*~*~*~

ఊహాలే ఊహలే పాట ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 

 
చిత్రం : జాను (2020) 
సంగీతం : గోవింద్ వసంత  
సాహిత్యం : శ్రీమణి     
గానం : చిన్మయి, గోవింద్ వసంత   

ఆఆఆఆఆఆ....ఆఆఆఅ...
 
పియా బాలము మోరా
పియా మోరా బాలము

పియా ఘర్ ఆవో ఘర్ ఆ
పియా ఘర్ ఆ ఓ జీ
బాలమ మోరా
బాలము మోరా పియా
పియా హ బాలము మోరా మోరా

ఆ ఆ చిన్ని మౌనములోన 
ఎన్ని ఊగిసలో
కంట నీరు లేని రోజు కలిసెనే
ప్రాణములో ప్రాణ సడే

ఊహలే ఊహలే నిను విడవవులే
గుండెకే ప్రాణమై పూసే పూసే
ఊహలే ఊహలే నిను మరిచిన వేళ
ఊపిరే లేని వేళ ఆ ఆ ఆ

~*~*~*~*~*~*~*~*~

కొమ్మ వీడి గువ్వే పాట ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : జాను (2020) 
సంగీతం : గోవింద్ వసంత  
సాహిత్యం : సిరివెన్నెల    
గానం : చిన్మయి, గోవింద్ వసంత్   
 
కొమ్మ వీడి గువ్వే వెళుతోందిలె 
పువ్వు కంట నీరే కురిసే
అమ్మ ఒడి వీడే పసిపాపలా 
వెక్కి వెక్కి మనసే తడిసే

చదివే బడికే వేసవి సెలవులా 
తిరిగి గుడికే రావాలి నువ్విలా
ఒక్కపూట నిజమై మన కలలు ఇలాఆ ఆ
ముందరున్న కాలం గడిచేది ఎలా 
బ్రతుకే గతమై ఈ చోటా ఆగేలా

కన్ను వీడి చూపే వెళుతోందిలే 
కంట నీరు తుడిచేదెవరే

చిరునవ్వులే ఇక నన్నే విడిచేనులే 
నిను విడువనీ ఏ నన్నో వెతికేనులే
చిగురాశలే ఇక శ్వాసే నిలిపేనులే 
మన ఊసులే జతలేక ఎడబాసెలే

నా నుంచి నిన్నే 
విడదీసేటి విధినైనా
వేధించి ఓడించె ఇంకో జన్మే 
వరమే వరమే

మనం మనం చెరో సగం 
చెరో దిశల్లే మారినా
ఒకే స్వరం ఏకాక్షరం 
చెరో పదంలో చేరినా
నువ్వున్న వైపు తప్ప 
చూపు తప్పు దిశను చూపునా

అడుగులన్ని మనము
కలిసి ఉన్న దారి విడిచేనా
మరీ మరీ నిన్నడగమంది 
జ్ఞాపకాల ఉప్పెన
చిరాయువేదో ఊపిరై 
నీకోసమెదురు చూపు
కవితలే రాసే నీకై మళ్ళీ రా

~*~*~*~*~*~*~*~*~

నా కలే కలై పాట ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : జాను (2020) 
సంగీతం : గోవింద్ వసంత  
సాహిత్యం : శ్రీమణి    
గానం : బృంద   
 
నా కలే కలై నన్నే వదిలే
నే నిలా ఎలా ఎలా 
నమ్మనీ నిజమే.. 
కుదురు చెదిరింది లే 

కలత తొలిసారిలా నాలోపలే 
అయ్యానులే శిలై 
ఎదురుపడవే నువ్వే 
మదికి వివరించవే.. 
నిజం ఇదేనని..

బదులే నువ్వే
నా జతగా నువ్వే లేక
తరగతీ గది గతే మారేనే ఇలా
నీ మరుపే గురుతే రాకా
మది పదే పదే 
నిన్నే వెతికెనే వలలా 

అసలు ఇది ఎవరి నేరమా
ఎలా అడగను
కనుల నది దాటు నీరు 
నే ఎలా నిలుపను 

మనసుకిది ఎంత భారమో
ఎలా తెలుపను 
సెలవిక నే అంత సులువుగా
ఎలా నమ్మను 

~*~*~*~*~*~*~*~*~

ఇంతేనా పాట ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 
 
 
చిత్రం : జాను (2020) 
సంగీతం : గోవింద్ వసంత  
సాహిత్యం : శ్రీమణి     
గానం : చిన్మయి 
 
ఇంతేనా ఇంతేనా 
ఒక మాటైనా మాటాడవేదైనా
ఇంతేనా ఇక ఇంతేనా ఎన్ని ఆశల్తో 
ఆలా నువ్వు నీ చెంతనా

కాలమే మారెనా దూరమే చేరినా
వసంతమెగిరి ఎడారి ఎదురైనా
ఈరోజు కోసం వేచింది నా ప్రాణమే
ఈరోజు కుడా గెలిచిందిలే నీ మౌనమే

సూటిగా చూపదే నీ గుండె చాటు 
భావాల బాధనే నువ్వే
ఎలా చెప్పాలి? ఎలా అడగాలి?
ఆటలాడేటి రాతలా నువ్వే

పాఠాలు చదివిన కాలం నువ్వే
పాఠాలు నేర్పిన కాలం నువ్వే
అర్ధం అవ్వనీ పాఠమల్లే 
ప్రతి క్షణం నా నువ్వే

సంద్రాలు దాటేను నా రెక్కలే 
తీరాలు తాకేను నా పరుగులే
మనసు మాత్రం నువ్వు 
విడిచిన చోటునే ఆగేనే..

రేపటి ఊహలు నిన్నటి ఆశలే 
కన్నీటి పాటలా నిన్ను దాటనులే
ఈరోజు కోసం వేచింది నా ప్రాణమే 
ఈరోజు కూడా నిన్ను అనే పోనివ్వనే

~*~*~*~*~*~*~*~*~

అనంతం/కాలాల ప్రేమ పాట ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ పాట సినిమాలో లేదు, ఈ వీడియో ఓ అభిమాని ఎడిట్ చేసినది. ఐతే సినిమాలోని అందమైన సన్నివేశాలన్నిటిని చూపించి దదాపు పూర్తి సినిమా చూసిన అనుభూతిని ఇస్తుంది అందుకే ఇక్కడ ఇస్తున్నాను. 


చిత్రం : జాను (2020) 
సంగీతం : గోవింద్ వసంత  
సాహిత్యం : సిరివెన్నెల    
గానం : గోవింద్ వసంత, చిన్మయి
సందీప్ రెడ్డి వంగ   
 
కాలాల ప్రేమ 
పుట్టేది ఎప్పుడంటే  ఏమో కదా
యుగాల ప్రేమ 
జాగాలనేలుతోంది రాజు లాగ 
శపించు వరమా

పూసే పువ్వోటి చాలే.. 
లోకాన్ని గెలిచి చూపుతోందే
తీపి కన్నీరు దాగుండే సాగరం ఇదే
ఈ ప్రేమ కావ్యం రాసింది 
ఎవ్వరంటే ఏమో కదా
ఈ ప్రేమ గాయం చేసేది ఎవ్వరంటే 
వివరమేది లేదంది కాలం

కాదన్న ప్రేమ నీడలాగా వస్తుందే
అవునన్న ప్రేమ చేతికంది రాదే
ప్రేమల్లో పడితే మాయలాగా ఉంటుందే
ప్రేమల్లో చెడితే ప్రాణమే నిశి

ఆగనంటూనే సాగదే 
సాగనంటూనే ఆగదే
అన్ని అంటూనే మూగదే 
ప్రేమకేది సాటిరాదే

ప్రాణమెంతున్న చాలదే 
జన్మలెన్నున్న మారదే
విశ్వమంతున్న ప్రేమదే 
గుప్పెడంత గుండే

ఓ ఈ ప్రేమలే అనంతమే ఆనందమల్లే
ఓ ఈ ప్రేమలే అనంతమే ఆవేదనల్లే

ఓ ఓ చిన్ని మౌనములోన
ఎన్ని ఊగిసలో రాసి లేని కావ్యం
ఊసు కలపదే ప్రేమలకే ఊపిరిదే

ఊహలే ఊహలే నిను విడవవులే…
గుండెకే ప్రాణమై పూసే పూసే…
ఊహలే ఊహలే నిను మరిచిన వేళ
ఊపిరే లేని వేళా ఆ ఆ ఆ

ఓ ఈ ప్రేమలే అనంతమే ఆనందమల్లే…
ఓ ఈ ప్రేమలే అనంతమే ఆవేదనల్లే…

ఓ..ఓహో శ్రీకారమే ఆకారమే
ఓంకారం ప్రేమే

ఓ..ఓహో అనంతమే
అనంతమే ఇదంతా ప్రేమే
 
చెప్పకుండా వచ్చే ఆ అనుభూతిని 
నీ గుండె చప్పుడు 
నీకు ముందే చెబుతుంది. 
ప్రేమ!
 
ప్రేమ ఒక రోజు నిన్నూ పలకరిస్తుంది 
దాన్ని కౌగిలించు కంటిరెప్పలో దాచు
ప్రేమ ఆగి చూస్తుంది 
ప్రేమ తడబడుతుంది 
ప్రేమ నవ్వుతుంది 
ప్రేమ కవ్విస్తుంది 
కవిత్వం రాస్తుంది 
ప్రేమ ఏడుస్తుంది. 

ప్రేమ కల్లోలంలో పడేస్తుంది 
ప్రేమ కాస్తంత అర్థమవుతుంది 
ప్రేమ విరహాన్ని పెంచుతుంది 
ప్రేమ వీడిపోతుంది
వెళ్లి రమ్మని ప్రేమకి 
తలుపు మూసినా 
చప్పుడవ్వని 
వీడుకోలు ఇవ్వు 
వేచి ఉండు...  

ఒకవేళ ప్రేమ మళ్ళీ వస్తే 
దూరంగా ఆగి చూస్తే 
దగ్గరగా వెళ్ళు 
ప్రేమతో పిలుపు నివ్వు 
అది చాలు
ప్రేమ నీ సొంతం 
నీ హృదయం ప్రేమ సొంతం 
మార్పులే ప్రశ్న 
మార్పులే సమాధానం
ప్రేమ!
 
~*~*~*~*~*~*~*~*~
  

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.