మంగళవారం, డిసెంబర్ 01, 2020

సాంబశివా నీదు మహిమ...

ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలై పలు ప్రశంసలందుకున్న మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంలోని ఒక చక్కని శివ తత్వాన్ని ఈ రోజు తలచుకుందాం. వీటిని ఎవరు రాశారో తెలీదు తరతరాలుగా తాతలు బామ్మలు వారసత్వంగా అందిస్తున్న తత్వాలివి. ఈ చిత్ర దర్శకుడు వినోద్ అనంతోజు కూడా తన బామ్మ దగ్గర విన్న ఈ శివతత్వాన్ని గుర్తున్నంత వరకూ ఈ సినిమాలో పెట్టానని చెప్పారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ జ్యూక్ బాక్స్ వీడియో ఇక్కడ చూడవచ్చు. పాట వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : మిడిల్ క్లాస్ మెలోడీస్ (2020)
సంగీతం : స్వీకార్ అగస్తి
సాహిత్యం : శివతత్వం
గానం : రామ్ మిరియాల, కోరస్   

సాంబశివా నీదు మహిమ 
ఎన్నటికీ.. తెలియదాయె
సాంబశివా నీదు మహిమ 
ఎన్నటికీ.. తెలియదాయె 
సాంబశివా నీదు మహిమ 
ఎన్నటికీ.. తెలియదాయె
సాంబశివా నీదు మహిమ 
ఎన్నటికీ.. తెలియదాయె
హర హరా.. శివ శివా
హర హరా.. శివ శివా

ఆ.. గంగా జలము తెచ్చి 
నీకు అభిషేకము సేతునంటె
గంగా జలము తెచ్చి 
నీకు అభిషేకము సేతునంటె
మరి గంగ జలమున సేపకప్పల 
ఎంగిలంటున్నావు శంభో
హర హరా.. ఆహ..శివ శివా
హర హరా..శివ శివా

ఆ..సాంబశివా నీదు మహిమ 
ఎన్నటికీ.. తెలియదాయె
హర హరా.. శివ శివా

ఆ.. ఆవుపాలు తెచ్చి 
నీకు అర్పితము సేతునంటే
ఆవుపాలు తెచ్చి 
నీకు అర్పితము సేతునంటే
ఆవుపాలనల లేగదూడల 
ఎంగిలంటున్నావు శంభో
హర హరా.. ఓహో.. శివ శివా
గట్టిగా.. హర హరా.. శివ శివా.. అద్దీ

సాంబశివా నీదు మహిమ 
ఎన్నటికీ.. తెలియదాయె
సాంబశివా నీదు మహిమ 
ఎన్నటికీ.. తెలియదాయె

అహా.. ఓహో.. ఓహో
తుమ్మి పూలు తెచ్చి 
నీకు తుష్టుగ పూజింతునంటే
తుమ్మి పూలు తెచ్చి 
నీకు తుష్టుగ పూజింతునంటే
కొమ్మా కొమ్మన కోటి 
తుమ్మెదలెంగిలంటున్నావు శివా
హర హరా.. శివ శివా.. అర్రె
హర హరా.. శివ శివా

సాంబశివా నీదు మహిమ 
ఎన్నటికీ.. తెలియదాయె
హర హరా.. గట్టిగా.. శివ శివా

నారికేళము తెచ్చి 
నీకు నైవేధ్యము సేతునంటే
నారికేళము తెచ్చి 
నీకు నైవేధ్యము సేతునంటే
అప్పుడు బహుఇష్టము అంటివి శంభో.. 
సామి..  హర హరా.. శివ శివా.. ఆహ
హర హరా.. ఓహో.. శివ శివా
హర హరా.. శివ శివా
హర హరా.. శివ శివా
 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.