శనివారం, జూన్ 06, 2020

తొలి వలపులలో...

గంగమంగ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 
 

చిత్రం : గంగమంగ (1973) 
సంగీతం : రమేష్ నాయుడు  
సాహిత్యం : దాశరథి  
గానం : ఘంటసాల, సుశీల  

తొలి వలపులలో ఏ చెలికైనా 
అలక ఉండునని విన్నాను 
అది కవుల కల్పననుకున్నాను 
అది కవుల పైత్యమనుకున్నాను 
నీలో నాపై అలక చూసి 
వలపు చేష్టలనుకున్నాను 
నీ చెలిమి కోరుతూ ఉన్నాను

మాయలు చేసి మీ మగవారు 
మాటలు చాలా నేర్చారు
ప్రతి మగువకిలాగే చెబుతారు
ఆడది తానై చెంతకు వస్తే 
అలిగే పనులే చేస్తారు 
ఆ అలకే వలపనుకుంటారు 

కోరినవాణ్ని కొంగు ముడేసి 
తిప్పదలచుకుంటారు
మరో మగువతో మాటాడగనే 
మూతి ముడుచుకుంటారు 
మొగము తిప్పుకుంటారు

ప్రేమ పేరుతొ చేకిలి నొక్కి 
సరసం ఆడుతుంటారు 
నిజం తెలిస్తే బుజం తడుముకొని 
నీతులు పలుకుతూ ఉంటారు
సాకులు చెబుతూ ఉంటారు

తొలి వలపులలో ఏ చెలికైనా 
అలక ఉండునని విన్నాను 
అది కవుల కల్పననుకున్నాను 

మాయలు చేసే మీ మగవారు 
మాటలు చాలా నేర్చారు 
ప్రతి మగువకిలాగే చెబుతారు

ఆడవారు తమ అనురాగంలో 
అనుమానం పడుతుంటారు
లోపల మమత బయట కలతతో 
సతమత మవ్వుతూ ఉంటారు
కుత కుత లాడుతు ఉంటారు

తేనెటీగలో ఉన్న గుణాలు 
మగవారలలో ఉంటాయి
వీలు దొరికితే వారి తలపులు 
దారి తప్పుతూ ఉంటాయి
పెడదారి పట్టుతూ ఉంటాయి

కలలోనైనా నా కన్నులలో 
వెలుగుతున్నదీ నీ రూపం
నీ అందాలను ఆరాదిస్తూ 
పూజించడమే నా ద్యేయం
జీవించడమే నా గమ్యం

కోరినవారు దూరమవుదురని 
గుబులు పడును నా మనసు
నీ హృదయంలో నాపై ప్రేమ 
నిండుగా ఉందని తెలుసు
అది పొంగుతున్నదని తెలుసు 
 

5 comments:

Beautiful song with excellent singing lyrics music and actors.

వాణిశ్రీ గారు అద్భుతమైన సహజనటి. సావిత్రి గారి తరువాత స్థానం వాణిశ్రీ గారిదే.

అజ్ఞాతలిద్దరికీ ధన్యవాదాలు.

అటు నటభూషణుడు..ఇటు కళాభినేత్రి..

అందుకే కదండీ పాట ఇలా సూపర్ హిట్ అయింది :-) థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.